మద్యం సేవిస్తే( Alcohol ) అనారోగ్యాల బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటామనే విషయం మనకు తెలిసిందే.అనారోగ్యాల బారిన పడటం వల్ల వయస్సు ఎక్కువగా కనిపిస్తాం.
అయితే మద్యం సేవిస్తే వయస్సు వెనక్కు వచ్చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఒక కాక్ టెయిల్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఇది వయస్సును బాగా తగ్గిస్తుందట.
శరీరాన్ని పునరుజీంపచేసి వయస్సును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి( Harvard Medical School ) సంబంధించిన సైంటిస్టులు ఈ కొత్త కాక్‌టెయిల్ ను కనిపెట్టారు.
ప్రస్తుతం చిట్టెలుకలు, కోతులపై జరిగిన క్లీనికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి.
త్వరలో ఈ ఔషధానికి సంబంధించిన క్లీనికల్ ట్రయల్స్‌ను మనుషులపై కూడా జరపనున్నారు.ఈ ఔషధం వయస్సు సంబంధిత వ్యాధుల చికిత్సతో పాటు పునరుత్పత్తి ఔషధాన్ని మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా శరీరం మొత్తం పునరుజ్జీవానికి కూడా సహకరిస్తుందని వైద్యులు గుర్తించారు.
ఇది శారీరక, మానసిక రుగ్మతల చికిత్సకు కూడా ఉపయోగపడుతుందట.అంతేకాకుండా కంటి నరాలు, మూత్రపిండాలు, కండరాలు, మెదడు కణజాలంపై అద్భుతంగా పనిచేస్తున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
చిట్టెలుకల్లో ఈ ఔషధాన్ని ప్రయోగించగా బాగా పనిచేసిందని, వాటి జీవనకాలం పెరిగిందని సైంటిస్టులు ( Scientists ) చెబుతున్నారు.అలాగే కోతులపై కూడా వీటిని ప్రయోగించగా.మంచి సత్పలితాలు వచ్చినట్లు గుర్తించారు.వచ్చే ఏడాది కల్లా ఈ ఔషధాన్ని మనుషులపై పూర్తిస్థాయిలో ప్రయోగించనున్నారు.ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.మనుషులపై జరిపే క్లీనికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయితే రానున్న కాలంలో దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండనున్నాయి.
అయితే జీన్ థెరపీ ద్వారా వయస్సు తగ్గించుకోవచ్చని గతంలో రుజువైంది.ఇప్పుడు కెమికల్స్ కాక్ టెయిల్స్ వల్ల కూడా వయస్సు తగ్గించుకోవచ్చని నిరూపితమైనట్లు అయింది.
వైద్య చరిత్రలో దీనిని ఒక కీలక అడుగుగా చెబుతున్నారు.ఈ కాక్‌టెయిల్‌కి( Cocktail ) సంబంధించిన వివరాలను హార్వర్డ్ సైంటిస్ట్ డేవిడ్ సిన్‌క్లయిర్( David Sinclair ) ట్విట్టర్ లో బయటపెట్టారు.