కుప్పకూలిన బిడెన్ పాపులారిటీ ...తప్పు ప్రజలదా..?? బిడెన్ దా...??

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నారని, హార్వర్డ్ హ్యారీస్ పోల్ సర్వే లో తేలిందని అమెరికాలో సోషల్ మీడియాలో, ప్రజలలో తీవ్ర చర్చ జరుగుతోంది.నిజంగానే ప్రజలలో బిడెన్ గ్రాఫ్ తగ్గిందా, లేక ప్రజల కారణంగా బిడెన్ గ్రాఫ్ తగ్గిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

 Harvard Caps-harris Poll Survey On Joe Biden, Us President Joe Biden, 100day Vac-TeluguStop.com

అదేంటి గ్రాఫ్ తగ్గిందంటే ప్రజలలో ఆదరణ లేకపోవడంవలనే కాదా అందుకు కారణం ప్రజలు అంటే ఎలా ఆయన చేత కానితనం అనుకునే వారు లేకపోలేదు.కానీ బిడెన్ గ్రాఫ్ ఎందుకు తగ్గింది అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటే అందుకు కారణం ప్రజలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సదరు సర్వే అంశాలను పరిశీలిస్తే…

హార్వర్డ్ హ్యారీస్ సర్వే ప్రకారం.అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది గతంలో కంటే కూడా ప్రస్తుతం డెల్టా వేరియంట్ విషయంలో అమెరికాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి అందుకు ప్రధాన కారణం బిడెన్ సరైన సమయంలో చర్యలు తీసుకోకపోవడమే నని ప్రజలు అభిప్రాయపడుతున్నారట.

అంతేకాదు డెల్టా ను కంట్రోల్ చేయాలని బిడెన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని ప్రజలు చెప్పారని సర్వే ప్రకటించింది.అలాగే మళ్ళీ మాస్క్ నిభందన అమలు చేయడం బిడెన్ వైఫల్యంగానే చెప్పారట.

అలాగే అమెరికాలో ఆర్ధిక పరిస్థితి అస్సలు బాలేదని తేల్చేశారట.అయితే బిడెన్ మద్దతు దారులు మాత్రం ఈ సర్వే రిజల్స్ పై మండిపడుతున్నారు.

Telugu Vaccine Target, Harvardcaps, Joe Biden-Telugu NRI

బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారని.100 రోజుల వ్యాక్సినేషన్ టార్గెట్ ను పూర్తి చేశారని.అయితే కొందరు వ్యాక్సిన్ పై చేసిన దుష్ప్రచారం, ప్రజలలో ఉన్న భయం కారణంగా ఎంతో మంది వ్యాక్సిన్ కు దూరంగా ఉంటూ వచ్చారని, బిడెన్ పదేపదే వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ ప్రజలలో ధైర్యం చెప్తున్నా, స్వచ్చంద సంస్థలు అవగాహనలు కల్పిస్తున్నా ప్రజలు ముందుకు రాలేదని అందుకు కారణం బిడెన్ అంటే ఎలా అంటూ మండిపడ్డారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారని, మళ్ళీ పరిస్థితులు అదుపులోకి వస్తున్న సమయంలో కావాలని ఇలా బురద చల్లుతున్నారని అంటున్నారు.

బిడెన్ పాపులారిటీ ఎక్కడా తగ్గలేదని, ప్రజల్లో ఉన్న భయం తొలిగితే వ్యాక్సినేషన్ మరింతగా జరిగుతుందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube