ముఖంపై ముడతలకు...గుండె జబ్బుకు ఒక లింక్ ఉంది... అదేంటో చూసి తప్పక తెలుసుకోండి.  

Hart Problems Pairing With Face Wrinkles-

గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది..

ముఖంపై ముడతలకు...గుండె జబ్బుకు ఒక లింక్ ఉంది... అదేంటో చూసి తప్పక తెలుసుకోండి.-Hart Problems Pairing With Face Wrinkles

ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు.

చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తాయి.

మరి అవి రాకుండా చూడలేమా.? అంటే.

చూసుకోవచ్చు… అందుకు నిత్యం వ్యాయామం చేయాలి, సరైన పౌష్టికాహారం తీసుకోవాలి..

ఇది ఇలా ఉండగా … నుదుటిపై ముడతలు ఎంత లోతుగా ఉంటే. ఆ మనిషికి అంత తీవ్రమైన గుండెజబ్బు ఉన్నట్లు భావించాలని పరిశోధకులు అంటున్నారు. అది ప్రాణాలు తీసేంత ప్రమాదంగా గుర్తించాలని ఫ్రాన్స్‌కు చెందిన హాస్పిటలైర్‌ యూనివర్సిటైర్‌ డి టోలౌజ్‌ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 3200 మందిని ఎంచుకొని వారి జీవన శైలి, నుదుటిపై ఏర్పడిన ముడతలను దాదాపు 20 ఏళ్లపాటు గమనించారు. రెండు, మూడు ముడతలు ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చేందుకు పదిరెట్లు ఎక్కువ అవకాశం ఉందని తెలిపారు.

అయితే గుండె సమస్య ఉందో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి. మోకాళ్లను వంచకుండా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకోవాలి. ఇలా విజయవంతంగా చేస్తే గుండె సమస్య లేనట్టే లెక్క.

అలా కాకుండా మోకాళ్లను ఎత్తాల్సి వస్తే అప్పుడు మీరు గుండె సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. దీంతో డాక్టర్‌ను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.