అరెస్ట్ అయిన విద్యార్ధులని కలుస్తాం..!!!  

Harshvardhan Shringla Wants To Meet Arrested Students In America-

విద్యార్ధి వీసాల అక్రమ కేసులో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్ధులు అందరిని సోమవారం లోగా భారతదేశ అధికారులు కలువనున్నారని తెలుస్తోంది.వారి వారి భయాలని పోగొట్టడానికి , వారిని సురక్షితంగా విడుదల చేయించడానికి కృషి చేయాలని భారత ప్రభుత్వం నుంచీ అంటే విదేశాంగ శాఖ నుంచీ కీలక ఆదేశాలు అందాయని

Harshvardhan Shringla Wants To Meet Arrested Students In America--Harshvardhan Shringla Wants To Meet Arrested Students In America-

అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌ శృంగ్లా ఆదివారం తెలిపారు.అరెస్టయిన విద్యార్థులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని, అమెరికా వ్యాప్తంగా అన్ని నిర్బంధ కేంద్రాలకు దౌత్యాధికారులు వెళ్తున్నారని , ఈ క్రమంలోనే విద్యార్ధుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అన్నారు.

ప్రస్తుతం విద్యార్ధులు అనుసరించాల్సిన తీరు విషయంలో పలు న్యాయసలహాలని ఇస్తున్నామని హర్షవర్థన్ తెలిపారు.విద్యార్థుల అరెస్టు వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా గుర్తించి, వారికి సహాయం చేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన అన్నారు.

ఇప్పటిదాకా అరెస్ట్ అయిన 130 మంది విద్యార్ధులలో ఒకరు తప్ప మిగిలిన వాళ్ళందరూ భారతీయులే.