తాప్సి రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న హర్షవర్ధన్ రాణే

టాలీవుడ్ గ్లామర్ పాత్రలకి మాత్రమే పరిమితం అయిన పంజాబీ బ్యూటీ తాప్సి హిందీలో మాత్రం ఫిమేల్ సెంట్రిక్ కథలతో డిఫరెంట్ కథాంశాలు ఉన్న చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.బ్యాక్ టూ బ్యాక్ ఆమె సినిమాలని లైన్ లో పెట్టింది.

 Harshvardhan Rane Waiting For Success Withtaapsee Pannu Haseen Dillruba, Bollywo-TeluguStop.com

కంగనాతో సినిమాలు చేద్దామని అనుకున్న దర్శకులు అందరూ తాప్సి వద్దకి క్యూ కడుతున్నారు.ఈ బ్యూటీ వ్యవహార శైలి హిందీలో ఎక్కువగా అవకాశాలు రావడానికి కారణం అవుతుందనే మాట వినిపిస్తుంది.

సోషల్ కాన్సెప్ట్ లతోనే ఆమె డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తుంది.ప్రస్తుతం తాప్సి రెండు బయోపిక్ లని వరుసగా లైన్ లో పెట్టింది.

ఇదిలా ఉంటే తాప్సి నటించిన కొత్త సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. హసీనా దిల్ రూబా టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ వినీల్ మాథ్యూ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఇద్దరు అబ్బాయిలని ప్రేమించే యువతీగా ఈ మూవీలో తాప్సి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.ఇదిలా ఉంటే ఈ మూవీలో తాప్సికి జోడీగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న నటుడు హర్షవర్ధన్ రాణే నటించాడు.

Telugu Bollywood, Haseen Dillruba, Netflix, Taapsee Pannu, Tollywood-Movie

తకిటతకిట మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రాజమండ్రి నేపధ్యం ఉన్న కుర్రాడు హర్షవర్ధన్ ముందుగా మోడలింగ్ లో అడుగుపెట్టాడు.తరువాత సినిమా ఎంట్రీ ఇచ్చాడు.అయితే తెలుగులో ఈ కుర్ర నటుడుకి అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదు.ఏవో అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోకి తక్కువ ఉండే పాత్రలు చేస్తూ వచ్చాడు.

అయితే హిందీలో మాత్రం హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.అక్కడ హర్షవర్ధన్ కి మంచి గుర్తింపు ఉన్న అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే రావడం లేదు.

ఐదేళ్ళ క్రితం సనమ్ తెరీ కసమ్ అనే మూవీతో హిందీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ప్రస్తుతం తాప్సి లీడ్ రోల్ లో నటిస్తున్న హసీనా దిల్ రుబా మూవీలో హర్షవర్ధన్ రాణే ఒక హీరోగా నటించాడు.

ఈ మధ్య తాప్సి వరుస హిట్స్ తో దూసుకుపోతూ ఉండటం ఈ మూవీకూడా కచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది.ఒక వేళ హిట్ అయితే మాత్రం హర్షవర్ధన్ కి తాప్సి కచ్చితంగా అదృష్ట దేవతగా మారినట్లే అని బిటౌన్ లో వినిపిస్తున్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube