బజరంగీలో చిన్నారి ఇప్పుడు హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తుందే

సల్మాన్ ఖాన్ హీరో గా విజయేంద్రప్రసాద్ కథతో తెరకెక్కి సూపర్ హిట్ అయినా సినిమా బజరంగీ భాయ్ జాన్.ఈ సినిమా బాహుబలి తర్వాత రిలీజ్ అయ్యి విజయేంద్రప్రసాద్ పేరుని బాలీవుడ్ లో కూడా పాపులర్ చేసేసింది.

 Harshali Malhotra Latest Pic Goes Viral, Bollywood, Child Artists, Bollywood Ci-TeluguStop.com

పాకిస్థాన్ నుంచి మిస్ అయ్యి అనుకోకుండా ఇండియాకి వచ్చి సల్మాన్ ఖాన్ కి దొరికే ఐదేళ్ల పాపగా హర్షాలీ మల్హోత్రా ఆ సినిమాలో నటించింది.అందులో ఆమె పేరు మున్నీ.

అందులో మూగ , చెవుడు ఉన్న పాపగా ఆమె తన హావభావాలతోనే అద్భుతమైన యాక్టింగ్ చేసింది.ఆ సినిమా చేసే సమయంలో ఆమె వయస్సు ఏడేళ్లు.

ఆ సినిమా తర్వాత మళ్ళీ హర్షాలీ ఏ సినిమాలో కూడా నటించలేదు.ఆ సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు అయిపొయింది.

తాజాగా ఈ చిన్నారి దీపావళీ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటో షేర్ చేసుకుంది.ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Bollywood, Child, Salman Khan-Movie

ఐదేళ్లలో హర్షాలీ లుక్ ఏకంగా హీరోయిన్ రేంజ్ లోకి మారిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే ఆమె లుక్ చూస్తూ ఉంటే ఏకంగా 17 ఏళ్ళు ఉన్నట్లు అనిపిస్తుంది.అయితే తన వయస్సు ఏకంగా 12 ఏళ్ళు మాత్రమే అని హర్షాలీ క్లారిటీ ఇచ్చింది. 12 ఏళ్ల వయస్సులోనే ఈ స్థాయిలో అందంగా మెస్మరైజ్ చేస్తూ ఉంటే కచ్చితంగా ఆమె 15 ఏళ్ళు దాటేసరికి హీరోయిన్ అయిపోతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇక ఆమె లుక్స్ చూసిన తర్వాత బాలీవుడ్ దర్శక, నిర్మాతల కన్ను కూడా పడినట్లు తెలుస్తుంది.అన్ని అనుకూలంగా జరిగితే మరో మూడు, నాలుగేళ్లలో హర్శాలీ హీరోయిన్ గా పరిచయం అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube