బోటు ప్రమాదం : మంత్రిపై హర్షకుమార్‌ సంచలన వ్యాఖ్యలు  

Harsha Kumar Comments On Avanthi Srinivas-deviptnam,harsha Kumar,papikondalu

పాపికొండలు వద్ద గోదావరిలో బోటులో ప్రయాణిస్తున్న సందర్బంగా ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే.బోటు ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయిన తర్వాత బోటును గుర్తించారు.అయితే బోటును రెండు రోజుల ముందే గుర్తించినా కూడా ప్రభుత్వం తప్పు తెలిసి పోతుందని ఆ విషయాన్ని చెప్పడం లేదు అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.

Harsha Kumar Comments On Avanthi Srinivas-deviptnam,harsha Kumar,papikondalu-Harsha Kumar Comments On Avanthi Srinivas-Deviptnam Harsha Papikondalu

బోటులో మొత్తం 93 మంది ఉన్నట్లుగా నా వద్ద సమాచారం ఉంది.కాని ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ చేసి చెబుతోంది.మృతుల సంఖ్యను చాలా వరకు తక్కువగా చూపించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Harsha Kumar Comments On Avanthi Srinivas-deviptnam,harsha Kumar,papikondalu-Harsha Kumar Comments On Avanthi Srinivas-Deviptnam Harsha Papikondalu

ఇక బోటు ప్రయాణంకు దేవిపట్నం ఎస్నై అనుమతించలేదు.దాంతో మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్వయంగా స్పందించి జిల్లా కలెక్టర్‌ మరియు ఎస్పీలకు ఫోన్‌ చేసి బోటుకు అనుమతించాలంటూ ఒత్తిడి చేయడం జరిగింది.

ఆ ఒత్తిడి కారణంగానే బోటుకు వారు పర్మిషన్‌ ఇవ్వడం జరిగింది.నాణ్యత లోపించిన బోటు అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే వాదన కూడా వినిపిస్తుంది.ఈ సమయంలో హర్ష కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారంను రేపుతున్నాయి.

ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ వాసులు ఎక్కువగా ఉండటంతో రెండు రాష్ట్రాల్లో కూడా ఈ విషయమై చర్చ జరుగుతోంది.