వైరల్.. ఇది జలపాతం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే..!

ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఉపయోగించని వారు ఉండ రంటే అతిశయోక్తి కాదేమో అంతలా ప్రజలు టెక్నాలిజీ ను ఉపయోగించు కుంటున్నారు.అయితే సామాన్యుల తో పాటు ప్రముఖులు కొంత మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

 Harsh Goenka Shares Mesmerising Video Of Cloud Waterfall From Mizoram, Harsh Goe-TeluguStop.com

ఏ చిన్న విషయమైన ఫాలోవర్లతో పంచు కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.అలాంటి ప్రముఖుల్లో హర్ష గోయంకా ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో.

ప్రపంచ నలుమూలలా జరిగే విషయాలు కూడా నిముషాల్లో ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా బాగా ఉపయోగ పడుతుంది.వాళ్లకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం చాలా మందికి అలవాటు.

హర్ష గోయంకా కూడా తనకు తెలిసిన విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు.తాజాగా ఆయన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసారు.

ఈ వీడియో చూసి నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.అంత ఆశ్చర్యపోయే వీడియో ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా ఆ వీడియో లో అచ్చం జలపాతం లో నుండి నీరు ప్రవిహిస్తూ కిందకు పడుతున్నట్టుగా ఉంది.కానీ ఇది జలపాతం కాదు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీనిని చుసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్య తోపాటు సంతోషంగా కూడా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

అచ్చం జలపాతంలా తలపించే ఆ దృశ్యాలు చూడడానికి చాలా మనోహరంగా ఉంది.దట్టమైన మేఘాలు కొండల మీద నుండి కిందకు కదులుతూ ఉన్న ఆ వీడియో చూపరులను బాగా ఆకట్టుకుంటుంది.మిజోరాం రాష్ట్రం లోని ఐజ్వాల్ లో ఈ అద్బుతమైన దృశ్యం ప్రజలను కనువిందు చేస్తుంది.

ఈ వీడియోను ది బెటర్ ఇండియా ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది హర్ష గోయంకా కంటపడింది.వెంటనే ఆయన రీట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.

మీరు కూడా ఈ వీడియోను చూసి మీ కామెంట్స్ తెలపండి.

https://twitter.com/thebetterindia/status/1411331395310522375

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube