ఆర్చీ' అని నామకరణం చేసిన హ్యారీ,మేఘన్.... నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఫోటోలు

ఇటీవల బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ దంపతులకు పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే.గతేడాది వీరి వివాహం అత్యంత ఘనంగా జరుగగా ఇటీవల వీరికి మగ బిడ్డ జన్మించారు.

 Harry And Meghan Introduce Their Son A Royal Named Archie-TeluguStop.com

అయితే ఈ దంపతులు తమ కలల పంట అయిన బాబును బుధవారం తొలిసారిగా మీడియా ముందుకు తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో వారు బాబుకు ‘ఆర్చీ’ అనే పేరు పెట్టినట్లు ప్రకటించారు.

ఆర్చీ' అని నామకరణం చేసిన హ్యార

తమ కుమారుడి పూర్తి పేరు ‘ఆర్చీ హ్యారిసన్ మౌంట్బాటన్-విండ్సర్’ అంటూ తమ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో హ్యారీ, మెర్కెల్ దంపతులు ప్రకటించారు.మాతృత్వం ఓ అద్భుత అనుభవం అంటూ మేఘన్ మెర్కెల్ పేర్కొన్నారు.వీరి ముగ్గురికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.బుల్లి ప్రిన్స్ ను చూసి పలువురు లైక్ లు కొడుతున్నారు.బ్రిటన్ ప్రిన్స్ అయిన హ్యారీ, నటి అయిన మేఘన్ మోర్కెల్ ను గతేడాది వివాహం చేసుకున్నారు.అయితే వీరికి పుట్టిన బాబుకు ఇటు బ్రిటన్ పౌరసత్వం తో పాటు తల్లి తో పాటు అమెరికా పౌరసత్వం కూడా లభించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube