బైక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్లీ-డేవిడ్‌సన్ ఎక్స్440( Harley-Davidson X440 ) ఎట్టకేలకు ఇండియాలో రిలీజ్ అయింది.ఈ బైక్ రూ.2.29 లక్షల ప్రారంభ ధరతో భారత్‌లో విడుదల అయింది.ఇది హార్లీ-డేవిడ్సన్( Harley-Davidson ) నుంచి లాంచ్ అయిన అత్యంత సరసమైన బైక్ అని చెప్పవచ్చు.ఈ ప్రీమియం బైక్ మరొక ఖరీదైన ట్రయంఫ్ స్పీడ్ 400తో( Triumph Speed 400 ) నేరుగా పోటీపడుతుంది.ఎక్స్440 బైక్‌ను జైపూర్‌లో ఒక కార్యక్రమంలో హీరో మోటోకార్ప్ ఛైర్మన్ డాక్టర్ పవన్ ముంజాల్, హార్లీ-డేవిడ్‌సన్ ఛైర్మన్, ప్రెసిడెంట్ సీఈఓ అయిన మిస్టర్ జోచెన్ జైట్జ్‌లు కలిసి ఆవిష్కరించారు.ఇది డెనిమ్, వివిడ్, ఎస్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఈ బైక్ భారతదేశంలో 400సీసీ విభాగంలోకి హార్లీ-డేవిడ్సన్, హీరో మోటోకార్ప్( Hero MotoCorp ) ప్రవేశాన్ని సూచిస్తుంది.ఎందుకంటే ఈ బైక్‌ను హీరో, హార్లీ-డేవిడ్‌సన్ బ్రాండ్లు రెండూ కలిసి అభివృద్ధి చేశారు.రాజస్థాన్‌లోని హీరోస్ గార్డెన్ ఫ్యాక్టరీలో స్థానికంగా తయారు చేశారు.X440 విడుదల తమ ప్రీమియం బైక్ ప్రయాణానికి ఒక ముఖ్యమైన దశ అని, భారతీయ వాహనదారులకు ఒక ప్రత్యేక విలువ అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ ముంజాల్ పేర్కొన్నారు.
హార్లీ-డేవిడ్‌సన్ ఎక్స్440 BS VI (OBD II), E20 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే కొత్త 440cc ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది.ఇది 27 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్, 38 ఎన్ఎమ్ టార్క్ పనితీరును అందిస్తుంది.దీని సెగ్మెంట్‌లో ఇది అత్యుత్తమమైనది.బైక్ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.