హరితేజను ఎదవ ఓవర్ యాక్టింగ్ అంటూ ట్రోల్ చేసిన నెటిజన్.. ఆమె ఏమందంటే?

సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది.సోషల్ మీడియా ద్వారా కొంతమంది నెటిజన్లు తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లకు దగ్గరవుతుంటే మరి కొందరు మాత్రం సెలబ్రిటీలను అడగకూడని ప్రశ్నలు అడిగి వాళ్లకు కోపం తెప్పిస్తున్నారు.

 Hariteja Strong Counter Netizen Who Wished Her Test Coronavirus Positive , Coron-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా, బుల్లితెర నటిగా, యాంకర్ గా, మూవీ ఆర్టిస్ట్ గా హరితేజ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.

ఎల్లప్పుడూ చలాకీగా ఉండే హరితేజ ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించడంతో పాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు.

ఒక నెటిజన్ హరితేజకు కరోనా పాజిటివ్ రావాలని కామెంట్ చేయగా నీకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి గాడ్ బ్లెస్ అంటూ హరితేజ సమయస్పూర్తితో జవాబిచ్చారు.మరొక నెటిజన్ హరితేజ యాక్టింగ్ ఎధవ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ అని కామెంట్లు చేయడంతో పాటు సీరియస్ టైమ్ లో కూడా హరితేజ సిల్లీ జోక్స్ వేస్తారని చెప్పుకొచ్చారు.

ఆ నెటిజన్ కౌంటర్ కు హరితేజ స్పందిస్తూ నవ్వితే బాధలు పోతాయని తాను భావిస్తానని పొగరు అనేది పనికిరాదని అన్నారు.బీపీ వస్తుందా సార్ చల్లపడండి జర అంటూ హరితేజ కామెంట్ చేశారు.

మరొక నెటిజన్ మీకు కరోనా పాజిటివ్ అని అనిపిస్తోందని కామెంట్ చేయగా ఇంకా ఏం అనిపిస్తోందని హరితేజ ఘాటుగా బదులిచ్చారు.హరితేజ వెటకారంగా నెటిజన్లకు ఇచ్చిన సమాధానాలు వైరల్ అవుతున్నాయి.

Telugu Ancor, Bidboss, Corona, Hariteja, Artist, Netizens Trolls-Movie

హరితేజకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.హరితేజ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఆమెకు కరోనా నిర్ధారణ అయింది.కొన్నిరోజుల పాటు హరితేజ ఆ సమయంలో కూతురికి దూరంగా ఉన్నారు.నటి హరితేజ బుల్లితెరపై వరుస ఆఫర్లను సంపాదించుకుని ఆ ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube