యాంకర్ హరితేజ ఇంట్లో బారసాల.. పాప పేరేంటంటే..?

ఒకప్పుడు సీరియల్స్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన హరితేజ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనడం ద్వారా తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు.బిగ్ బాస్ షో హరితేజ కెరీర్ కు బాగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే.

 Hariteja Daughter Photos Goes Viral In Social Media-TeluguStop.com

బుల్లితెర ఒకవైపు యాంకర్ గా బిజీ అవుతూనే వెండితెరపై కూడా అవకాశాలను సంపాదించుకుంటూ హరితేజ సత్తా చాటారు.ప్రస్తుతం సినిమా ఆఫర్లపైనే హరితేజ ఎక్కువగా దృష్టి పెట్టారు.

కొన్ని నెలల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ తాజాగా ఆ బిడ్డకు పేరు పెట్టారు.కూతురి బారసాల వేడుకను హరితేజ తన ఇంట్లో ఘనంగా జరిపారు.

 Hariteja Daughter Photos Goes Viral In Social Media-యాంకర్ హరితేజ ఇంట్లో బారసాల.. పాప పేరేంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ షో ద్వారా అభిమానులను భారీగా పెంచుకున్న హరితేజ తన ఇన్ స్టాగ్రామ్ లో కూతురు ఫోటోలను షేర్ చేశారు.అయితే హరితేజ ఫోటోలలో పాప ముఖాన్ని చూపించడానికి మాత్రం ఇష్టపడలేదు.

పాపకు హరితేజ భూమి దీపక్ రావు అని నామకరణం చేశారు.

రొటీన్ పేర్లకు భిన్నమైన పేరును హరితేజ పాపకు పెట్టడం గమనార్హం.ఆ ఫోటోకు హరితేజ అద్భుతమైన క్యాప్షన్ ను కూడా జోడించారు.పాప తన అమ్మానాన్నలు తనకు భూమి దీపక్ రావ్ అని పేరు పెట్టారని భూమి అనే పేరు ఉన్నంత మాత్రాన సహనంగా ఉంటానని అనుకోవద్దని అలా అనుకుని తన సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే తనను అందరూ భూమి అని పిలవచ్చని పాప చెప్పినట్టు హరితేజ క్యాప్షన్ ను జోడించారు.

భూమిని హరితేజ దంపతులు ఎత్తుకున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.హరితేజ షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు.హరితేజ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

#Hariteja #Social Media #Anchor Hariteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు