కూతురు ఫోటోను షేర్ చేసిన హరితేజ.. ఎంత క్యూట్ గా ఉందో..?

బుల్లితెర యాంకర్లలో ఒకరైన హరితేజ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ కెరీర్ కు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.కొన్ని రోజుల క్రితం హరితేజ కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆ ఫోటోలలో కూతురు ముఖం కనిపించకుండా ఫోటోలను షేర్ చేశారు.

 Hariteja Daughter Photo Goes Viral In Social Media, Daughter Photo,  Goes Viral-TeluguStop.com

అయితే తాజాగా హరితేజ కూతురుకు సంబంధించిన ఫోటోను రివీల్ చేశారు.

హరితేజ కూతురుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా హరితేజ కూతురు క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఇటీవల హరితేజ కూతురు బారశాల ఫంక్షన్ చేయడంతో పాటు భూమి దీపక్ రావు అని కూతురుకు నామకరణం చేసినట్లు వెల్లడించారు.కొంతమంది నెటిజన్లు కూతురు ఫోటోను ఎప్పుడు చూపిస్తారని అడగగా హరితేజ త్వరలోనే చూపిస్తానంటూ వెల్లడించారు.

Telugu Charcter Artist, Deepak Rao, Hariteja, Serial Offers, Tollywood, Yanker-M

నెటిజన్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ హరితేజ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడం గమనార్హం.హరితేజ షేర్ చేసిన ఫోటోకు భారీ సంఖ్యలో లైకులు వస్తుండగా పలువురు సీరియల్ నటులు హరితేజలా పాప కూడా అందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. 2015 సంవత్సరంలో హరితేజ, దీపక్ రావ్ ల వివాహం ఘనంగా జరిగింది.

ఈ ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన హరితేజ ఆడపిల్లకు జన్మనిచ్చారు.

Telugu Charcter Artist, Deepak Rao, Hariteja, Serial Offers, Tollywood, Yanker-M

సినిమాల విషయానికి వస్తే హరితేజ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.సినిమాల్లో హరితేజ చేస్తున్న పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి.ఈ మధ్య కాలంలో సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలకు దూరంగా ఉన్న హరితేజ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

సినిమా, సీరియల్, టీవీ ఆఫర్లను హరితేజ సద్వినియోగం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube