థాయ్ లాండ్‌లో సీరియల్ నటుల సందడే సందడి.. పొట్టి బట్టల్లో రచ్చ రచ్చ!

వెండితెర కు సంబంధించిన నటీనటులే కాకుండా బుల్లితెరకు సంబంధించిన నటులు కూడా తాము ఎందులోనూ తక్కువ కాదు అన్నట్లుగా చూపిస్తున్నారు.వాళ్లు కూడా హీరోయిన్ల మాదిరిగా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బాగా రచ్చ చేస్తున్నారు.

 Hariteja And Navya Swamy Enjoys In Thailand, Hari Teja, Navya Swamy, Thailand, T-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా మరో ఇద్దరు సీరియల్ నటులు కూడా బాగా సందడి చేస్తున్నారు.ఇంతకు వాళ్ళు ఎవరు అంటే.

హరితేజ, నవ్య స్వామి.

బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ పరిచయమే.

యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.తొలిసారిగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.

ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.తన నటనకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.

అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.ఆ తర్వాత ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.

ఇక ఆమె 2015 లో దీపక్ ను వివాహమాడగా.తమకు ఒక కూతురు కూడా ఉంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

ఈమెకు నవ్య స్వామి మంచి ఫ్రెండ్.వీరిద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో వీరిద్దరు కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.జిమ్ లో కూడా వీరిద్దరు కలిసి వర్కౌట్లు చేస్తూ ఉంటారు.

నిజానికి వీరిద్దరూ కలిసి నటించకపోగా.హరితేజ భర్త ద్వారా వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

నవ్య స్వామి కూడా బుల్లి తెర పై మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Telugu Hari Teja, Navya Swamy, Thailand, Tollywood-Movie

సీరియల్స్ లలోనే కాకుండా పలు షో లలో కూడా బాగా సందడి చేస్తుంది నవ్య స్వామి.ఇక ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఇదిలా ఉంటే వీరిద్దరు కలిసి తాజాగా థాయిలాండ్ ట్రిప్ కి వెళ్లారు.

ఇక అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను తాజాగా హరితేజ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.అందులో ఇద్దరు పొట్టి పొట్టి బట్టలతో షాక్ ఇచ్చారు.కొందరు హరితేజ ని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.కూతురు పుట్టాక కూడా ఈమె ఎలా తయారవుతుంది ఏంటి అని విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube