ఎన్టీఆర్‌ నమ్మకం నిలబెట్టుకోలేక పోయాను, మరో ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నా  

Harish Shankar Wants A Film With Jr Ntr-jr Ntr,ramaiah Vastavaiah,valmiki Movie,valmiki Movie Release Date,varun Tej

దర్శకుడు హరీష్‌ శంకర్‌ ‘వాల్మీకి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ‘వాల్మీకి’ చిత్రంను ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Harish Shankar Wants A Film With Jr Ntr-jr Ntr,ramaiah Vastavaiah,valmiki Movie,valmiki Movie Release Date,varun Tej Telugu Tollywood Movie Cinema Film Latest News-Harish Shankar Wants A Film With Jr NTR-Jr Ntr Ramaiah Vastavaiah Valmiki Movie Release Date Varun Tej

అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.వాల్మీకి చిత్రం ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

  హరీష్‌ శంకర్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రం తర్వాత వెంటనే ఎన్టీఆర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’ అనే చిత్రాన్ని చేశాడు.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.ఎన్టీఆర్‌ కెరీర్‌లో అదో మచ్చగా మిగిలి పోయింది.సూపర్‌ హిట్‌ ఇస్తాడనుకున్న హరీష్‌ శంకర్‌ తీవ్రంగా నిరాశ పర్చడంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Shankar Wants A Film With Jr Ntr-jr Ntr,ramaiah Vastavaiah,valmiki Movie,valmiki Movie Release Date,varun Tej Telugu Tollywood Movie Cinema Film Latest News-Harish Shankar Wants A Film With Jr NTR-Jr Ntr Ramaiah Vastavaiah Valmiki Movie Release Date Varun Tej

తాజాగా ఎన్టీఆర్‌ గురించి హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ.ఎన్టీఆర్‌కు ఒక మంచి హిట్‌ ఇవ్వాలని చాలా ఆసక్తిగా ఉన్నాను అన్నాడు.

 

నాకు చాలా ఇష్టమైన యంగ్‌ హీరో ఎన్టీఆర్‌.ఆయనతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తాను.రామయ్యా వస్తావయ్యా చిత్రం చేసే అవకాశం ఇచ్చినందుకు గాను ఆయనకు నేను రుణపడి ఉంటాను.ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో చాలా నిరుత్సాహ పడ్డాను.

నాపై ఎన్టీఆర్‌ పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోలేక పోయాను.అందుకే మరో ఛాన్స్‌ ఇస్తే తప్పకుండా ఒక సూపర్‌ హిట్‌ తీస్తాననే నమ్మకం ఉందని హరీష్‌ శంకర్‌ అన్నాడు.

మరి ఎన్టీఆర్‌ మనోడిని నమ్మి మరో ఛాన్స్‌ ఇస్తాడా చూడాలి

.

తాజా వార్తలు