పవన్ కళ్యాణ్ సినిమా తర్వాతే ఇంకేదైనా అంటున్నా హరీష్ శంకర్  

Harish Shankar gives clarity on Pawan Kalyan movie, Tollywood, South cinema, Telugu cinema, vakil Sahab movie, Power Star Pawan Kalyan - Telugu Harish Shankar Gives Clarity On Pawan Kalyan Movie, Power Star Pawan Kalyan, South Cinema, Telugu Cinema, Tollywood, Vakil Sahab Movie

2019 ఎన్నికల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరల సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు.అందులో భాగంగా ముందుగా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

 Harishankar Gives Clarity On Pawan Kalyan Movie

దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.లాక్ డౌన్ కారణంగా దియేటర్ లో మూత పడకుండా ఉంటే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత వేగంగా ఫినిష్ చేసి రిలీజ్ కి రెడీ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కి కూడా ప్రస్తుతం రాజకీయ ప్రచారాలు చేయడానికి అవకాశం లేకపోవడంతో షూటింగ్ పూర్తిచేసి నెక్స్ట్ సినిమాకి రెడీ అవ్వాలి అని అనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా తర్వాతే ఇంకేదైనా అంటున్నా హరీష్ శంకర్-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.అయితే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత ఇది పట్టాలెక్కే అవకాశం ఉంది.

అయితే ఈ లోపు హరీష్ శంకర్ మరో సినిమాని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.అలాగే అయ్యప్పన్ కోశియం సినిమా రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడని కూడా చర్చ నడుస్తుంది.

అయితే ఈ వార్తలకి హరీష్ శంకర్ తాజాగా మరోసారి ఫుల్ స్టాప్ పెట్టాడు.పవన్ కళ్యాణ్ తో సినిమా పూర్తి చేసేంతవరకు మరొక సినిమా చేసే అవకాశం లేదని తేల్చిచెప్పేశాడు.

తాను పవన్ కళ్యాణ్ సినిమా కంటే ముందు వేరొక సినిమా చేస్తానని వార్తలు అన్నీ కూడా కేవలం కల్పితం మాత్రమే అని స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Harishankar Gives Clarity On Pawan Kalyan Movie Related Telugu News,Photos/Pics,Images..