కేసీఆర్ ను చూసి ఓటెయ్యాలంటున్న హ‌రీశ్‌.. క్యాండిడేట్ గురించి చెప్ప‌క‌పోతే ఎలా..?

ఎన్నిక‌లు ఏవైనా స‌రే అక్క‌డ పోటీ చేస్తున్న వ్య‌క్తి గురించి చెప్పి ఓట్లు అడ‌గటం చాలా ముఖ్యం.ఎందుకంటే గెలిచిన త‌ర్వాత ప్ర‌జల‌కు విదేయుడిగా ఉండేది అత‌నే కాబట్టి.

 Harish Wants To Vote For Kcr What If He Doesnt Tell About The Candidate, Harish,-TeluguStop.com

రేపు ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్ను న‌మ్మే ఓటేస్తే ఆయ‌న‌పైనే ఆధార‌ప‌డుతారు కాబ‌ట్టి.ఆ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ఆయ‌న చేతుల్లోనే ఉంటుంది.

కాబట్టి.ఇక క్యాండిడేట్ పేరు చెప్పిన త‌ర్వాత‌నే పార్టీలో కీల‌కంగా ఉండే అధినేత చేస్తున్న అభివృద్ధి గురించి పార్టీ అధికారంలో లేకుంటే అధినేత అంత‌కు ముందు ఆయ‌న చేసిన అభివృద్ధి ప‌నుల గురించి చెప్పుకోవ‌డం కామ‌న్‌.

అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో చాలా చిత్ర విచిత్రాలు జ‌రుగుతున్నాయి.అదేంటంటే ఇక్క‌డ బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ తాను నియోజ‌క‌వ‌ర్గానికి చేసిన అభివృద్ధిని చూసి ఓట్లుడుగుతున్నారు.

ఇది బాగానే ఉంది.అయితే ఆయ‌న బీజేపీ పేరును గానీ లేదంటే న‌రేంద్ర‌మోడీ చేస్తున్న అభివృద్ధిని చూపించి గానీ ఓట్ల‌డ‌గ‌ట్లేదు.

ఇది ఒక‌ర‌క‌మైన విచిత్రం అనుకుంటే ఇక టీఆర్ ఎస్‌లో ఇందుకు భిన్నంగా ఉంది.ఎందుకంటే ఇక్క‌డ పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ పేరు ఎక్క‌డా వినిపించ‌ట్లేదు.

Telugu Etela Rajender, Gellu Srinivas, Harish, Huzurabad, Candi, Trshuzurabad, T

అంతా తానై న‌డిపిస్తున్న హ‌రీశ్‌రావు ఎక్క‌డా గెల్లు పేరును హైలెట్ చేయ‌ట్లేదు.ఎంత‌సేపు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌ను చూసే ఓటెయ్యాలంటూ అడుగుతున్నారు.కానీ గెల్లు శ్రీనివాస్ అంత‌కు ముందు ఏం చేశారు, గెలిస్తే ఏం చేస్తార‌నే దానిపై క‌నీసం క్లారిటీ కూడా ఇవ్వ‌ట్లేదు.ఆయ‌న పేరున ప‌రిచ‌యం చేయ‌కుండానే కేవ‌లం టీఆర్ ఎస్‌, కేసీఆర్ అన్న ప‌దాలు మాత్ర‌మే వాడుతున్నారు.

మ‌రి కేసీఆర్ గురించి చెబుతున్న దాంట్లో పావు వంతు అయినా అభ్య‌ర్థి గురించి చెబితే బాగుంటుంద‌ని స్థానిక నేత‌లు వాపోతున్నారంట‌.అప్పుడే ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని ఇలా ఎంత సేపు పార్టీ పేరు చెబితే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube