ప్రీ లుక్ తో కాక పుట్టించిన వరుణ్ తేజ్! రెట్రో రౌడీలా ఉన్నాడుగా

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.కెరియర్ లో ఇప్పటి వరకు కమర్షియల్ జోనర్ జోలికి వెళ్ళకుండా సాఫ్ట్ పాత్రలతో నటుడుగా తనదైన ముద్ర వేసిన వరుణ్ తేజ్ మెగా హీరోలందరి కంటే భిన్నమైన దారిలో వెళ్తున్నారు.

 Harish Shankar Valmiki Varun Tej Surprised To Fans In Pre Teaser-TeluguStop.com

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ చివరిగా అంతరిక్షం అనే ఓ స్పేస్ థ్రిల్లర్ సినిమాతో పాటు ఎఫ్ 2 లాంటి కమర్షియల్ కామెడీ మల్టీ స్టారర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ వాల్మీకి అనే సినిమాలో నటిస్తున్నాడు.

త‌మిళ‌నాట హిట్ మూవీ అయిన జిగ‌ర్తాండ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కథ మాత్రమే తీసుకొని కమర్షియల్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు.ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ వ‌రుణ్ తేజ్ చేస్తున్నాడు.

త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ చేస్తుంది.డిజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి.14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ టీజర్ తాజాగా విడుదలైంది.ఇందులో రెట్రో స్టైల్ లో ఫ్రెంచ్ రౌడీళా వరుణ్ తేజ్ చాలా క్రురంగా కనిపిస్తున్నాడు.ఇప్పుడు ఈ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.మరి తమిళ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాతో వరుణ్ తనలో మరో కోణాన్ని ఎలా చూపిస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube