ఆహ కోసం నిర్మాతగా మారుతున్న హరీష్ శంకర్

డిజిటల్ ట్రెండ్ ప్రస్తుతం నడుస్తుంది.ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన దర్శకులు, నటులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ పై మెరవడానికి రెడీ అయిపోయారు.

 Harish Shankar Turned As A Producer For Aha-TeluguStop.com

డిఫరెంట్ కథలతో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.డిజిటల్ ఆడియన్స్ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ముగ్గురు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసి తమని తాము ప్రూవ్ చేసుకున్నారు.అలాగే కొంత మంది దర్శకులు కూడా వెబ్ సిరీస్ లతో సత్తా చాటారు.

 Harish Shankar Turned As A Producer For Aha-ఆహ కోసం నిర్మాతగా మారుతున్న హరీష్ శంకర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రవీణ్ సత్తారు రీసెంట్ గా తమన్నాతో 11 అవర్స్ అనే వెబ్ సిరీస్ చేశాడు.ఇది పరవాలేదని టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్ శంకర్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు.అయితే అతను దర్శకుడుగానో, లేదా రచయితగానో రంగంలోకి దిగడం లేదు.

నేరుగా నిర్మాత అవతారం ఎత్తుతున్నాడు.నిర్మాతగా ఆహ ఒటీటీ కోసం ఓ వెబ్ ఫిలింని నిర్మిస్తున్నాడు.

Telugu Aha, Digital Entertainment, Director Dasharath, Harish Shankar, Ott Channels, Tollywood-Movie

మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు దశరథ్ ఆ తరువాత అనుకున్న స్థాయిలో ట్రాక్ లోకి రాలేకపోయాడు.చాలా కాలంగా అయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు.అయితే ఇప్పుడు రచయితగా ఓ మంచి కథని సిద్ధం చేసి హరీష్ శంకర్ కి వినిపించడంతో దానిని తెరకెక్కించే బాద్యత హరీష్ తీసుకున్నాడు.ఇక ఈ వెబ్ ఫిల్మ్ తో ఓ కొత్త దర్శకుడుని పరిచయం చేయబోతున్నారు.

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ మూవీని కొత్త వాళ్ళతో చేయాలని హరీష్ శంకర్ భావిస్తున్నట్లు బోగట్టా.లాక్ డౌన్ అనంతరం మూవీ స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

#Harish Shankar #OTT Channels

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు