మళ్లీ గబ్బర్‌సింగ్‌ కన్ఫర్మ్‌!

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల్లో ఒక్కటి ‘గబ్బర్‌ సింగ్‌’.హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే.

 Harish Shankar To Direct Pawan Kalyan Again ..?-TeluguStop.com

‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో హరీష్‌ శంకర్‌ ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు.అయితే ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

తాజాగా ఈయన మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ మూవీని తెరకెక్కించాడు.ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్బంగా హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ.తాను మరోసారి పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయని, ఆ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం నటిస్తున్న ‘సర్దార్‌’ చిత్రం తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో నటించేందుకు ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.పవన్‌ కళ్యాణ్‌ కోసం ‘జనగనమన’ అనే టైటిల్‌ను కూడా దిల్‌రాజు రిజిస్ట్రర్‌ చేయించాడు.

ఆ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తాడేమో చూడాలి.పవన్‌, హరీష్‌ శంకర్‌లు కలిస్తే మరోసారి ‘గబ్బర్‌ సింగ్‌’ ఫలితం రిపీట్‌ అవుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube