హరీష్ శంకర్ ని రెడీ అవ్వమని చెప్పిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేసుకున్నాడు.కరోనా సెకండ్ వేవ్ వకీల్ సాబ్ కలెక్షన్స్ కి కొంత వరకు తగ్గించిన నిర్మాత దిల్ రాజుకి మాత్రం ఈ సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

 Harish Shankar Ready To Script For Pawan Kalyan Movie-TeluguStop.com

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పన్ కొషియమ్ మూవీ రీమేక్ షూటింగ్ లని పవన్ కళ్యాణ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.హరిహర వీరమల్లు 30 శాతం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

అలాగే ఏకే రీమేక్ కూడా చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తుంది.ఈ రీమేక్ లో రానా కూడా నటిస్తూ ఉండటంతో దీనిపైన భారీ హైప్ ఉంది.

 Harish Shankar Ready To Script For Pawan Kalyan Movie-హరీష్ శంకర్ ని రెడీ అవ్వమని చెప్పిన పవన్ కళ్యాణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.అలాగే పూజా హెగ్డే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా కనిపించాబోతుందనే మాట బలంగా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఫుల్ స్క్రిప్ట్ ని నేరేట్ చేయడం జరిగిందని తెలుస్తుంది.ఇక కథ మొత్తం విన్న తర్వాత ఎలాంటి మార్పులు చెప్పకుండా పవర్ స్టార్ ఒకే చెప్పాడని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకోమని అతనికి చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో అన్ని కుదిరితే జులైలో సెట్స్ పైకి వెళ్ళే విధంగా రెడీ అవ్వాలని హరీష్ కి పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చినట్లు సమాచారం.

#HariHara #AK Remake #Harish Shankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు