రామ్ తో హరీష్ శంకర్..!

గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఎనౌన్స్ చేశారు.పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ మొదలు పెడదామని అనుకుంటున్న హరీష్ శంకర్ కి ఇప్పుడప్పుడే పవన్ డేట్స్ దొరికేలా లేవని తెలుస్తుంది.

 Harish Shankar Ram Combination Movie Is On Cards ,  Bhavadeeyudu Bhagath Singh ,-TeluguStop.com

ఈమధ్యనే మరో రీమేక్ కోసం పవన్ డేట్స్ అడ్జెస్ట్ చేశాడు.సో హరీష్ శంకర్ సినిమాకి ఇంకాస్త టైం పట్టేలా ఉంది.

ఈ క్రమంలో హరీష్ శంకర్ వేరే హీరోతో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని అర్ధమవుతుంది.రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసి దిగిన ఫోటో షేర్ చేయగానే హరీష్ శనక్ర్ నెక్స్ట్ హీరో అల్లు అర్జున్ అని వార్తలు రాశారు.

కానీ హరీష్ శంకర్ డీజే ఐదు ఏళ్లు అవుతున్న సందర్భంగా మాత్రమే బన్నీని కలిశాడట.పవన్ సినిమాకు ముందు హరీష్ శంకర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఓ సినిమా ప్లానింగ్ చేస్తున్నాడని టాక్.

రామ్ కి సరిపోయే ఓ ఎనర్జిటిక్ స్టోరీ రెడీ చేశాడట హరీష్ శంకర్.త్వరలోనే రామ్ ని కలిసి కథ వినిపించాలని చూస్తున్నాడట.ఇక రామ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం లింగుసామితో ది వారియర్ చేస్తుండగా ఆ సినిమా తర్వాత రీసెంట్ గా బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.ఒకవేళ హరీష్ శంకర్ తో సినిమా చేయాల్సి వచ్చినా బోయపాటి మూవీ పూర్తి చేశాక ఆ సినిమా చేసే అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube