మూడేళ్ళుగా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న హరీష్ శంకర్ .. కుట్ర జరుగుతుందా ?

ఇండస్ట్రీ సక్సెస్ లో ఉన్నవాళ్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది.ప్లాప్స్ పడితే ఇక అంతే సంగతులు.

 Harish Shankar Pawan Kalyan Project Latest Updates Details, Harish Shankar, Pawa-TeluguStop.com

హీరోలు దగ్గరికి రానివ్వవక పోగా ప్రేక్షకులకు అస్సలు గుర్తు ఉండరు.ఇక టాలీవుడ్ లో మంచి నైపుణ్యం ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి హరీష్ శంకర్.

రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన హరీష్ శంకర్ రవి తేజ హీరో గా నటించిన షాక్ సినిమా తో తొలిసారి మెగాఫోన్ చేత పట్టదు.ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ అవ్వకపోయిన రవి తేజ మరొకసారి పిలిచి అవకాశం ఇచ్చాడు.

దాంతో రవి తేజ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హరీష్ మిరపకాయ్ సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

Telugu Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Sai Dharam Tej,

ఈ చిత్రం రవి తేజ కెరీర్ లో ఒక మైలు రాయి గా నిలిచిపోయింది.ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేసి సూపర్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాదు అటు పవన్ కళ్యాణ్ కి ఇటు హరీష్ శంకర్ కి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టింది.

ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ కెరీర్ మెల్లిగా గాడి తప్పింది.గబ్బర్ సింగ్ తర్వాత ఏ చిత్రం విజయ వంతం కాకపోగా కెరీర్ కూడా పడిపోయింది.

ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ సినిమా చేస్తున్నాడు హరీష్.ఇప్పటికైతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు కానీ ఇంత కన్నా ముందు కూడా పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా అధికారికంగా ప్రకటించగా అది మూడేళ్ళుగా అటకెక్కి కూర్చుంది.

Telugu Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Sai Dharam Tej,

ఇక ఇప్పుడు ఉస్తాద్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి.దీంతో హరీష్ సినిమా పై అనుమానాలు మొదలయ్యాయి.వాస్తవానికి వకీల్ సాబ్ సినిమా తర్వాత ఉస్తాద్ సినిమా ప్రారంభం అవ్వాలి కానీ మధ్యలో భీమ్లా నాయక్ వచ్చింది.ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో పవన్ బిజీ అయిపోయాడు.

ఇప్పుడేమో త్రివిక్రమ్ మొదలు పెట్టిన పవన్ – ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ సినిమా ఊపందుకుంది.ఇన్ని సినిమాల మధ్య హరీష్ ప్రాజెక్టు మళ్లీ పక్కకు పోయేలా ఉంది.

ఇప్పటికే మూడేళ్ళ నుంచి పైసా సంపాదన లేకుండా ఎదురు చూస్తున్న హరీష్ కి పుండు మీద కారం చల్లినట్టు ఉంది పరిస్థితి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube