పీకే 28 కోసం క్రిష్‌తో కలిసి వర్క్‌ చేస్తున్న హరీష్‌ శంకర్‌

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలకు సంబంధించి ఇప్పటికే పింక్‌ రీమేక్‌ వకీల్‌ సాబ్‌ విడుదలకు సిద్దం అయ్యింది.

 Harish Shankar, Pawan Kalyan,krish,pk28,mythri Movies, Gabbar Singh, Naveen,myth-TeluguStop.com

ఇక పీకే 27 చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది.కరోనా విపత్తు రాకుండా ఉండి ఉంటే ఆ సినిమా పట్టాలెక్కేది.

ఇక పీకే 28 చిత్రంను హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.గబ్బర్‌సింగ్‌ తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది.
హరీష్‌ శంకర్‌ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… పవన్‌ కళ్యాణ్‌ గారితో మైత్రి మూవీస్‌ నవీన్‌ గారు సినిమా చేయాలనుకున్నారు.ఆ సమయంలో నా పేరును నవీన్‌ గారు పవన్‌ గారికి సజెస్ట్‌ చేయగా ఆయన ఓకే అన్నాడట.

పవన్‌ కళ్యాణ్‌ గారు నాపై పెట్టిన నమ్మకంకు కృతజ్ఞతలు.మరో విజయాన్ని పవన్‌తో కలిసి దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా హరీష్‌ శంకర్‌ పేర్కొన్నాడు.

Telugu Gabbar Singh, Harish Shankar, Krish, Mythri, Naveen, Pawan Kalyan, Pk-

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. దర్శకుడుక్రిష్‌తో పాటు మరికొందరు రచయితలతో కలిసి సినిమాకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాం.విలక్షణమైన స్క్రిప్ట్‌ రెడీ చేస్తామనే నమ్మకంను హరీష్‌ వ్యక్తం చేశాడు. స్టోరీ లైన్‌కు మాత్రమే పవన్‌ ఓకే చెప్పాడని, ఇంకా పూర్తి స్క్రిప్ట్‌ పవన్‌కు వినిపించలేదని ఈ సందర్బంగా హరీష్‌ శంకర్‌ అన్నాడు.

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో పవన్‌తో మూవీ ప్రారంభిస్తామన్నట్లుగా పవన్‌ ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube