ఇలాంటి పరిస్థితుల్లో హరీష్‌ శంకర్‌ డబుల్‌ గేమ్‌ అవసరమా?

‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ టాప్‌ దర్శకుల జాబితాలో చేరిన హరీష్‌ శంకర్‌ ఆతి త్వరగా కిందికి జారాడు.వరుసగా రెండు ఫ్లాప్స్‌ పడటంతో హరీష్‌ శంకర్‌ తో సినిమాలు చేసేందుకు టాప్‌ హీరోలు ఆసక్తి చూపడం లేదు.

 Harish Shankar In Double Role As A Producer And Director-TeluguStop.com

డీజే చిత్రంను అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ఈ దర్శకుడు ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన కారణంగా తదుపరి చిత్రానికి చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.స్టార్‌ హీరోలతో సినిమా ప్రయత్నించిన ఈ దర్శకుడు చివరకు వరుణ్‌ తేజ్‌ తో సినిమాను షురూ చేశాడు.

వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న వాల్మీకి చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సమయంలోనే మరో సినిమాకు ఈయన సిద్దం అవుతున్నాడు.అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించబోవడం లేదు.కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించబోతున్నాడు.మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ సంస్థతో కలిసి హరీష్‌ శంకర్‌ సినిమా నిర్మాణం చేయబోతున్నాడు.ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

కొత్త వారితో మీడియం బడ్జెట్‌తో ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఒక వైపు దర్శకుడిగా మరో వైపు నిర్మాతగా అంటే మామూలు విషయం కాదు.సుకుమార్‌ ప్రస్తుతం ఇదే తరహాలో ఉన్నాడు.సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరో వైపు నిర్మాతగా రాణిస్తున్నాడు.

కాని హరీష్‌ శంకర్‌ మొదట దర్శకుడిగా సక్సెస్‌ను దక్కించుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత నిర్మాతగా మారొచ్చు అనేది కొందరి వాదన.

ఒకేసారి దర్శకత్వం మరియు నిర్మాణం అయితే డబుల్‌ గేమ్‌ అవుతుంది.రెండు పడవల ప్రయాణం ఎప్పటికి మంచిది కాదు అనేది చాలా మందికి అనుభవంతో అయ్యింది.

మరి హరీష్‌ శంకర్‌ అనుభవం పొందే వరకు ఇలాగే చేస్తాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube