అందరు వేరే ప్రయత్నాల్లో ఉన్నా హరీష్‌ మాత్రం పవన్‌ కోసం వెయిటింగ్‌  

harish shankar don\'t want to do a small film before pawan kalyan movie Harish Shankar, Pawan Kalyan, Krish, Vaishnavu Tej, Vakeel Sahebh - Telugu Harish Shankar, Krish Director, Pawan Kalyan, Telugu Film News, Vakeel Saab

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన సమయంలో కరోనా లాక్‌ డౌన్‌ రావడంతో ఎనిమిది నెలలుగా పవన్‌ షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నాడు.

TeluguStop.com - Harish Shankar Dont Want To Do A Small Film Before Pawan Kalyan Movie

వకీల్‌ సాబ్‌ తర్వాత పవన్‌ మూడు నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యాడు.అందులో మొదటగా క్రిష్‌ దర్శకత్వంలో.

ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆ వెంటనే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కూడా చేసేందుకు డేట్లు ఇచ్చాడు.కాని ఇప్పటి వరకు వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ ను కూడా ముగించలేక పోయాడు.

TeluguStop.com - అందరు వేరే ప్రయత్నాల్లో ఉన్నా హరీష్‌ మాత్రం పవన్‌ కోసం వెయిటింగ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దాంతో క్రిష్‌ తో పాటు అందరు దర్శకులు కూడా కనీసం ఏడాది పాటు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.పవన్‌ కోసం వెయిట్‌ చేయకుండా క్రిష్‌ ఇటీవలే మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ తో ఒక సినిమాను పూర్తి చేశాడు.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను పూర్తి చేసినట్లుగా సినిమా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మరో వైపు పవన్‌ కోసం వెయిట్‌ చేయకుండా సురేందర్‌ రెడ్డి కూడా మరో సినిమాను చేయాలనుకుంటున్నాడు.

అఖిల్‌ అక్కినేనితో సురేందర్‌ రెడ్డి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.పవన్‌ డేట్లు ఇవ్వక ముందే అఖిల్‌ తో మూవీని పూర్తి చేసే ఉద్దేశ్యంతో సూరి ఉన్నాడు.

అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ఏర్పాట్లను సూరి ప్రారంభించబోతున్నాడు.వచ్చే ఏడాది పవన్‌ తో సినిమాను చేయడానికి ముందే అఖిల్‌ తో మూవీని పట్టాలెక్కించడం పూర్తి చేయడం విడుదల చేయడం కూడా చేయాలని భావిస్తున్నాడు.

అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.కాని హరీష్‌ శంకర్‌ మాత్రం పవన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

మరే చిన్న సినిమా చేయాలని భావించడం లేదు.నేరుగా పవన్‌ తోనే సినిమా చేయాలనుకుంటున్నట్లుగా చెప్పాడు.

గద్దల కొండ గణేష్‌ విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది.అయినా ఇప్పటి వరకు పవన్‌ తో మూవీ కోసం వెయిట్‌ చేశాడు.

మరో ఏడాది పాటు పవన్‌ డేట్ల కోసం హరీష్‌ శంకర్‌ వెయిట్‌ చేసేలా ఉన్నాడు.ఈ గ్యాప్‌లో ఇతర దర్శకుల మాదిరిగా చిన్న సినిమాను చేస్తే బాగుంటుంది కదా అంటే నో అంటున్నాడు.

#Harish Shankar #Vakeel Saab #Pawan Kalyan #Krish Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Harish Shankar Dont Want To Do A Small Film Before Pawan Kalyan Movie Related Telugu News,Photos/Pics,Images..