ఫ్యాన్స్‌కు నచ్చే పవన్‌ను చూపిస్తానంటోన్న దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రెడీ చేస్తున్న పవన్, తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు.

 Harish Shankar, Pawan Kalyan, Gabbar Singh, Vakeel Saab-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత పవన్‌ తనకు గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్‌తో మరోసారి చేతులు కలుపుతున్నాడు.

అయితే పవన్‌తో చేయబోయే సినిమా గురించి దర్శకుడు హరీష్ శంకర్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

పవన్ కోసం మరోసారి పక్కా కమర్షియల్ మూవీని రెడీ చేస్తున్నానని, ఈ సినిమాలో పవన్ అదిరిపోయే యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పిస్తాడని హరీష్ శంకర్ అంటున్నాడు.ఇక ఈ సినిమాలో గబ్బర్‌సింగ్ చిత్రంలోని కొన్ని సీన్స్‌కు పోలికలు ఉంటాయని, అవి చూస్తే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆస్వాదిస్తారని ఆయన అంటున్నాడు.

ఈ సినిమాలో కనిపించే పవన్‌ను ప్రేక్షకులు తప్పకుండా ఇష్టపడతారని, తాము కోరుకున్న పవన్‌ ఈయనే అని వారు కాలర్ ఎగరేయడం ఖాయమని హరీస్ అంటున్నాడు.మొత్తానికి తాను తీయబోయే సినిమాలో పవన్ పాత్రను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడని హరీష్ శంకర్ మాటలు వింటే తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube