ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ ఇండస్ట్రీలో పుడతాడా.. ఈ కామెంట్లు చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.తారక్ తో ఒకసారి పని చేసిన దర్శకులు మళ్లీమళ్లీ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.

 Harish Shankar Comments About Junior Ntr Goes Viral In Social Media Details, Junior Ntr, Director Harish Shankar, Junior Ntr Birthday, Harish Shankar About Ntr, Ramayya Vasthavayya, Yamadonga, Adhurs, Aadi-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో రామయ్యా వస్తావయ్యా ఎక్కువసార్లు చూశానని ఎందుకు ఆ సినిమా ఫ్లాపైందనే కారణంతో ఎక్కువసార్లు చూశానని హరీష్ శంకర్ అన్నారు.

సింగిల్ టేక్ హీరో ఎన్టీఆర్ అని హరీష్ శంకర్ కామెంట్లు చేయడం గమనార్హం.

 Harish Shankar Comments About Junior Ntr Goes Viral In Social Media Details, Junior Ntr, Director Harish Shankar, Junior Ntr Birthday, Harish Shankar About Ntr, Ramayya Vasthavayya, Yamadonga, Adhurs, Aadi-ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ ఇండస్ట్రీలో పుడతాడా.. ఈ కామెంట్లు చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేను మొట్టమొదట కథ చెప్పిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని 2004 సమయంలో తాను తారక్ కు కథ చెప్పానని హరీష్ శంకర్ వెల్లడించారు.ఒక డైలాగ్ చెప్పాలన్నా ఒక డ్యాన్స్ మూవ్ మెంట్ చేయాలన్నా ఒక పంచ్ కొట్టాలన్నా ఎన్టీఆర్ అని మళ్లీ ఇలాంటి హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో పుడతాడా అంటూ హరీష్ శంకర్ ప్రశ్నించారు.

ఈ విషయానికి సంబంధించి సందేహం అస్సలు అవసరం లేదని ఆయన అన్నారు.

తనకు యంగ్ టైగర్ అనే పదం విన్న వెంటనే ఆది, సింహాద్రి సినిమాలు గుర్తుకు వస్తాయని డైలాగ్ అంటే యమదొంగ గుర్తుకొస్తుందని కామెడీ అనగానే అదుర్స్ గుర్తుకు వస్తుందని హరీష్ శంకర్ వెల్లడించారు.ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన రామయ్యా వస్తావయ్యా ఫస్టాఫ్ బాగున్నా సెకండాఫ్ ఆకట్టుకోలేదు.

ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు కూడా కొంతమేర నష్టాలను మిగిల్చింది.అయితే హరీష్ శంకర్ ఎన్టీఆర్ తో మరో సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కడం సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది.

హరీష్ శంకర్ ప్రస్తుతం భవదీయుడు భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube