పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన హరీష్.. ఇది నిజంగా గుడ్ న్యూసే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూసే డైరెక్టర్లలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముందు వరుసలో ఉన్నారు.

వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబోలో రాబోతున్న నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.అయితే వారి కోరిక తీరి వీరిద్దరి కాంబోలో ఒక సినిమా కూడా ప్రకటించారు.

కానీ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సెట్స్ మీదకు రాలేదు.దీంతో ఈ సినిమా క్యాన్సిల్ అయిందేమో అని అంతా భావిస్తున్న సమయంలో హరీష్ శంకర్ మాత్రం అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తూ ఈ సినిమా ఉంది అని గుర్తు చేస్తున్నాడు.

ఇక తాజాగా హరీష్ శంకర్ చేసిన పోస్ట్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కు జోడీగా నటిస్తుంది.

ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాతో పాటు పవన్ చేతిలో మరో సినిమా కూడా ఉంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టు కూడా తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇదిలా ఉండగా తాజాగా హరీష్ శంకర్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది.పూజా హెగ్డేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ త్వరలోనే నీతో సెట్స్ లో వర్క్ చేసేందుకు ఎదురు చూస్తున్న అంటూ భవదీయుడు సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చేసాడు.దీంతో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లడం ఖాయం అని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు