పవర్ స్టార్ అభిమానులను బ్లాక్ చేస్తున్న హరీష్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలుసు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.

 Harish Shankar Blocking Power Star Fans On Twitter-TeluguStop.com

అందుకే ఈ కాంబో లో రాబోతున్న మరొక సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా మొదలు పెట్టలేదు.

ఇప్పుడిప్పుడే కరోనా నుండి కొద్దికొద్దిగా కోలుకుంటున్న సమయంలో ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్ వినిపిస్తుంది.పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి డేట్స్ కూడా కేటాయించాడని వార్తలు వస్తున్నాయి.

 Harish Shankar Blocking Power Star Fans On Twitter-పవర్ స్టార్ అభిమానులను బ్లాక్ చేస్తున్న హరీష్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

ఈ వార్తలపై డైరెక్టర్ హరీష్ శంకర్ విసిగి పోయినట్టు తెలుస్తుంది.ఈ రూమర్స్ కు చెక్ పెట్టడానికి హరీష్ శంకర్ పవన్ అభిమానులను బ్లాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది.సోషల్ మీడియా వేదిక అయినా ట్విట్టర్ లో పవన్ అభిమానులను హరీష్ బ్లాక్ చేస్తున్నాడట.

ఇప్పటికే హరీష్ చెప్పిన డేట్ కె అప్డేట్ ఇస్తామని చెప్పిన పవన్ అభిమానులు కొద్దిగా కూడా సంయమనం పాటించడం లేదట.

దీంతో విసిగి పోయిన హరీష్ శంకర్ వాళ్ళను బ్లాక్ చేస్తున్నాడట.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.అంతేకాదు రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియం అనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

#Power Star Fans #Pawan Kalyan #Twitter #Harish Shankar #HarishShankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు