పవన్ కంటే ముందే మరొకటి అంటోన్న డైరెక్టర్

టాలీవుడ్‌లో తనదైన స్టయిల్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఆయన కెరీర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన గబ్బర్ సింగ్ చిత్రం ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచింది.

 Harish Shankar Another Movie Before Pawan Kalyan, Harish Shankar, Pawan Kalyan,-TeluguStop.com

ఈ సినిమాను పవర్‌ఫుల్‌గా తెరకెక్కించడంతో హరీష్ శంకర్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు.ఇక ఈ సినిమా తరువాత పవన్‌తో కలిసి మళ్లీ సినిమా చేసే అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు ఈ డైరెక్టర్.

అయితే పవన్ తన 28వ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కి్స్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు పవన్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.

అయితే పవన్ ప్రస్తుతం ఎలాంటి సినిమా షూటింగ్‌లలో పాల్గొనడం లేదు.దీంతో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రాబోయే సినిమా షూటింగ్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్‌కు మరింత ఎక్కువ సమయం పడుతుండటంతో హరీష్ శంకర్ ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ప్రముఖ ఓటీటీ కోసం ఓ సినిమా కథను ఇప్పటికే రెడీ చేశాడు ఈ డైరెక్టర్.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేయనుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.మరి పవన్ కళ్యాణ్‌తో చేయబోయే సినిమాను హరీష్ శంకర్ ఎప్పుడు ప్రారంభిస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏదేమైనా పవర్ స్టార్‌తో చేయబోయే సినిమాను పక్కనబెట్టి మరీ హరీష్ శంకర్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube