హుజూరాబాద్ లో బెడసికొడుతున్న హరీష్ రావు వ్యూహాలు...అసలు కారణమిదే

తెలంగాణలో  హుజూరాబాద్ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు విదితమే.అయితే ఈటెల రాజీనామా తర్వాత క్రెడిబిలిటీ కోసం టీఆర్ఎస్, ఆత్మగౌరవ నినాదంతో ఈటెల రాజేందర్ గెలుపు దిశగా పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు.

 Harish Rao's Tactics In Huzurabad . Is The Real Reason  Trs Party, Harish Rao, E-TeluguStop.com

అయితే ఈటెలపై సానుభూతి వ్యక్తమయితే ఈటెల గెలుపును ఎవరూ అపలేరని రాజకీయ విశ్లే షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావు తనదైన వ్యూహాలలో హుజూరాబాద్ లో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.అయితే హరీష్ వ్యూహాలు ప్రతి చోట ఎంతో కొంత  ప్రజల నుండి ఆశించిన స్పందన వ్యక్తమయింది.

కాని హుజూరాబాద్ లో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి కాని, మంత్రి హరీష్ రావుకి గాని వింత అనుభవాలు ఎదురవుతున్నాయి.అయితే ఈటెలను వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ కంటే ముందే  బీజేపీ వ్యూహాలు సిద్దం చేసుకొని ఉన్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ప్రజలు ఈటెల రాజేందర్ కు అనుకూలంగా మాట్లాడుతున్న పరిస్థితులు హరీష్ రావు కు ఎదురవుతున్నాయి.

Telugu @trspartyonline, Bjp, Etela Rajender, Harish Rao, Huzurabad, Ts Congress,

అయితే దీనికి ప్రధాన కారణం ఈటెలపై ప్రజలకు పెద్ద సానుభూతి కలగడమే అని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా టీఆర్ఎస్ బీజేపీ కంటే విభిన్న వ్యూహాలతో వెళితే గాని టీఆర్ఎస్ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube