ప్రచారంలో హరీష్ రావు దూకుడు...మరి వ్యూహాలు ఫలించేనా?

Harish Raos Aggression In The Campaign Will More Tactics Work

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు పరిచయం అక్కరలేని పేరు.ఎప్పుడు ఎక్కడ టీఆర్ఎస్ కీలకంగా నెగ్గాల్సిన సమయంలో హరీష్ రావు చాలా చాకచాక్యంగా పకడ్భందీ వ్యూహాలతో టీఆర్ఎస్ ను ఆ సదరు ఎన్నికల్లో గట్టెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 Harish Raos Aggression In The Campaign Will More Tactics Work-TeluguStop.com

అందుకే హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది.అయితే ప్రస్తుతం హరీష్ రావు హుజురాబాద్ లో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ప్రచారంలో హరీష్ రావు పెద్ద ఎత్తున దూకుడు ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే టీఆర్ఎస్ అనుకూల వర్గాలతో సమావేశమైన హరీష్ రావు క్షేత్ర స్థాయిలో ఓటర్లను టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది.

 Harish Raos Aggression In The Campaign Will More Tactics Work-ప్రచారంలో హరీష్ రావు దూకుడు…మరి వ్యూహాలు ఫలించేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే హరీష్ రావు ఇప్పటికైతే  టీఆర్ఎస్ విజయంపై కానీ, మెజారిటీపైన కానీ ఇప్పటికైతే వ్యాఖ్యానించిన పరిస్థితి లేదు.

అయితే టీఆర్ఎస్ నుండి ఈటెల గెలవడానికి ఎటువంటి వ్యూహాలు అనుసరించిందో, ఏయే వర్గాలు టీఆర్ఎస్ గెలవడానికి దోహదపడ్డాయో ఆయా వర్గాలను మరల టీఆర్ఎస్ వైపు ఉండేలా హరీష్ రావు వ్యూహాలు కదుపుతున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ గెలుపుపై టీఆర్ఎస్ నేతలు కూడా బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి లేదు.అయితే అందుకు గల ప్రధాన కారణం సైలెంట్ వ్యూహంతో ఇటు బీజేపీని కాంగ్రెస్ ను ఎదుర్కొంటూ ముందుకు సాగేలా వాతావరణాన్ని నిర్మించుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే హరీష్ రావు మాత్రం కెసీఆర్ కు ఎప్పటికపుడు రిపోర్ట్ ను ఇస్తూ తాజా పరిస్థితులపై కెసీఆర్ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ హుజూరాబాద్ లో రాజకీయ రణరంగం కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

#Bjp #Poltics #@CM_KCR #Trs #Harish Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube