హుజురాబాద్ ప్రచారంలో కీలకంగా మారిన హరీష్ రావు... సత్తా చాటేనా?

తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల పైనే హడావిడి నెలకొన్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం చాలా వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

 Harish Rao, Who Has Become A Key Figure In The Huzurabad Campaign ... Satta Chat-TeluguStop.com

సమయం దగ్గర పడుతున్న కొద్దీ పోటీలో ఉన్న పార్టీలు చాలా వరకు గెలుపు వ్యూహాలను పన్నడంలో నిమగ్నమైన పరిస్థితి ఉంది.అయితే ఇక అసలు విషయంలోకి వస్తే హుజూరాబాద్ లో మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఈ  హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైన విషయం.ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ నియోజకవర్గం కంచుకోట.

ఏటేటా మెజారిటీ పెంచుకుంటూ దూసుకుపోయిన టీఆర్ఎస్ ఒక్కసారిగా ఓడిపోతే ఇక రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలినట్టు అవుతుంది.అంతేకాక ప్రతిపక్షాలు ప్రజల్లో టీఆర్ఎస్ పై ఎంత మేర వ్యతిరేకత ఉందనడానికి ఈ ఓటమే నిదర్శనం అన్న రీతిలో ప్రచారం నిర్వహించే  అవకాశం ఉంది.

అది టీఆర్ఎస్ ఎదుగుదలకు, వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

Telugu @trspartyonline, Huzurabad, Harish Rao, Telangana-Political

అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనైనా పార్టీని గెలిపించుకోగలిగే సత్తా ఉన్న ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావును కెసీఆర్ ఏరికోరి కీలక ప్రచార కర్తగా నియమించారు.ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు బరిలో ఉన్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నపరిస్థితి ఉంది.

అయితే అసెంబ్లీ సమావేశాల తరువాత కెసీఆర్ స్పీచ్ తో కొంత టీఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీచిన పరిస్థితుల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ అనే విషయాన్ని ప్రస్తుతం మనం చెప్పలేని పరిస్థితి.మరి హరీష్ రావు టీఆర్ఎస్ ను గెలిపించే విషయంలో సత్తా చాటుతాడా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube