హరీష్ దే కష్టమంతా ! ఇక్కడ గెలిస్తేనే ? 

హుజురాబాద్ ఉప ఎన్నికలు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కంటే , ఆయన మేనల్లుడు మంత్రి హరీష్ రావు కి ఎక్కువ టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించే బాధ్యతను పూర్తిగా మంత్రి హరీష్ రావు తీసుకున్నారు.

 Harish Rao Took The Trouble To Win The Trs Candidate In Huzurabad Hareesh Rao, G-TeluguStop.com

పార్టీలో ట్రబుల్ షూటర్ గాను ఆయనకు పేరు ఉండడం, గతంలో ఇవ్వనంత స్థాయిలో ఇప్పుడు కెసిఆర్ హరీష్ రావు కు ప్రాధాన్యం కల్పిస్తూ ఉండడం, ఇలా చాలా కారణాలతోనే ఈ ఉప ఎన్నికలను హరీష్ రావు  అత్యంత ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నారు.

   చాలా రోజుల నుంచి ఈ నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హరీష్ చూసుకుంటున్నారు.

అయితే గతంలో హరీష్ ఈటెల రాజేందర్ మంచి స్నేహితులు కావడం,  ఇప్పుడు రాజేందర్ ను ఓడించే బాధ్యత హరీశ్ కు కేసీఆర్ అప్పగించడం , ఈటెల రాజేందర్ ఇక్కడ ఓటమి చెందేలా చేస్తేనే కెసిఆర్ తనను పూర్తిగా నమ్ముతారని, లేకపోతే తన పై అనేక అనుమానాలతో ఉంటారనే భయం హరీష్ రావును వెంటాడుతోంది.ఆ భయంతోనే ఈ నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో హరీష్ నిమగ్నం అయ్యాడు.

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రసంగాలను హరీష్ ఇస్తున్నారు.
   

Telugu Cm Kcr, Congress, Etela Rajender, Gellusrinivas, Hareesh Rao, Hareeshrao,

  టిఆర్ఎస్ కు ఓటు వేస్తేనే మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాలు అభివృద్ధి చెందేలా ప్రత్యేకంగా దత్తత తీసుకుంటామని , పూర్తిస్థాయిలో ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాము అంటూ హరీష్ ప్రసంగాల్లో పేర్కొంటున్నారు.టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు  శ్రీనివాస్ యాదవ్ ను వెంటబెట్టుకుని ఈ నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ, స్వయంగా ఓటర్లను కలుస్తూ, రకరకాలుగా గెలుపు అవకాశాలపై కేసీఆర్ దృష్టి సారించారు.ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే కెసిఆర్ పూర్తిగా తనను నమ్ముతారని,  భవిష్యత్తులో కీలక బాధ్యతలు అప్పగిస్తారు అని, లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని హరీష్  నమ్ముతున్నారు.

అందుకే మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టి పూర్తిగా హుజురాబాద్ పై ఫోకస్ పెట్టినట్టుగా హరీష్ వ్యవహారం కనిపిస్తోంది.

  .

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube