మంత్రి హరీశ్ రావుకు జరిమానా.. ఎవరు వేశారో తెలుసా?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు మిగతా నాయకులతో పోలిస్తే మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా కీర్తి గడించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కీలక పాత్ర వహించిన హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్నారు.

 Harish Rao Punishes Himself With Penalty-TeluguStop.com

రికార్డు స్థాయిలో విజయం సాధించిన ఆయన అంతే స్థాయిలో తనదైన పనితీరుతో ప్రజల మనిషిగా గుర్తింపు సాధించారు.కాగా తాజాగా మంత్రి హరీష్ రావుకు భారీ జరిమానా పడింది.

ఇంతకీ మంత్రి హరీష్ రావుకు జరిమానా ఎవరు విధించారు.అసలు ఎందుకు విధించారు అని అనుకుంటున్నారా? మంత్రి హరీష్ రావు తాజాగా దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపినీ కార్యక్రమం నిర్వహించారు.దీనికి మంత్రి హరీష్ రావు చాలా ఆలస్యంగా వచ్చారు.ఉదయం 11.30కు రావాల్సిన హరీష్, మధ్యాహ్నం 3.30కు సభాస్థలికి చేరుకున్నారు.

దీంతో చాలాసేపు తమను ఎదురుచేయించినందుకు మన్నించాలని కోరారు హరీష్ రావు.అంతేగాక తనకు జరిమానా విధించాలని మహిళలను కోరారు.దీంతో మహిళలు తమకు మహిళా భవనం కోసం నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావును కోరగా ఆయన అధికారులతో మాట్లాడి వెంటనే రూ.50 లక్షల నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube