హ‌రీష్ రావు ప‌ని అయింది... ఇక.. కేటీఆర్‌కు వంతు వ‌చ్చేసింది...!  

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో చిత్ర‌మైన విష‌యాలు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి.వాస్త‌వానికి ఇవి స్థానిక ఎన్నిక‌లు.

TeluguStop.com - Harish Rao Political Chapter Close Nowits Time To Ktr

స్థానికంగా డివిజ‌న్ల‌లో ఉండే కార్పొరేట‌ర్ల భ‌విష్య‌త్తు తేలుతుంది.కానీ, ఇప్పుడు ఇవే ఎన్నిక‌లు మంత్రుల భ‌విత‌వ్యానికి అగ్నిప‌రీక్ష‌గా మారాయి.

అధికార పార్టీ టీఆర్ ఎస్‌.గ్రేట‌ర్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను మంత్రుల‌కే వ‌దిలేసింది.

TeluguStop.com - హ‌రీష్ రావు ప‌ని అయింది… ఇక.. కేటీఆర్‌కు వంతు వ‌చ్చేసింది…-General-Telugu-Telugu Tollywood Photo Image

మ‌రీ ముఖ్యంగా గ్రేట‌ర్ లో పార్టీని గెలిపించే బాథ్య‌త‌ల‌ను మంత్రి కేటీఆర్ భుజాల‌కెత్తుకున్నారు.వాస్త‌వానికి గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఆయ‌నే గ్రేట‌ర్‌లో చ‌క్రం తిప్పారు.

ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు.గ్రేట‌ర్ అబివృద్ధికి త‌నదే పూచి అన్నారు.

ఇక‌, ఇప్పుడు కూడా ఆయ‌నే సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా మారారు.

అయితే.

ఇక్క‌డ ప‌రిస్థితులు అంత ఈజీగాలేవు.ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోయింది.

వాస్త‌వానికి ఇక్క‌డ కూడా మంత్రి హ‌రీష్ రావు బాధ్య‌త‌లు భుజాన వేసుకున్నారు.కేసీఆర్ కూడా స్వ‌యంగా ఆయ‌న‌ను విశ్వ‌సించారు.

హ‌రీష్ అయితే.ఇక‌, తిరుగు ఉండ‌ద‌ని అనుకున్నారు.

ఈ క్ర‌మంలో హ‌రీష్‌కూడా బాగానే చ‌మ‌టోడ్చారు.అయితే.

ఫ‌లితం తిర‌గ‌బ‌డింది.దీంతో హ‌రీష్ రావు కూడా సైలెంట్ అయిపోయారు.

టీఆర్ఎస్‌లోని కేటీఆర్ వ‌ర్గం అప్పుడే.హ‌రీష్‌రావు ప‌ని అయిపొయింద‌నే ప్ర‌చారం ప్రారంభించేసింది.

అయితే.ఇంత‌లోనే గ్రేట‌ర్ ఎన్నిక‌లు రావ‌డంతో ఇప్పుడు కేటీఆర్‌కు అస‌లు సిస‌లు ప‌రీక్ష ప్రారంభ‌మైంది.టీఆర్ ఎస్ లో కేసీఆర్ త‌ర్వాత కేటీఆర్, హ‌రీష్‌రావులే కీల‌కం.అయితే.

హ‌రీష్‌రావు.వ్యూహాలు దుబ్బాకలో ప‌రాజ‌యం పాల‌వ‌డంతో కేటీఆర్ గ్రేట‌ర్‌లో పుంజుకోవాల్సిన త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇక్క‌డ ఏమాత్రం బెడిసి కొట్టినా.టీఆర్ఎస్‌లో లుక‌లుక‌లు ఖాయం.

మొత్తానికే కేసీఆర్ సార‌థ్యానికి దెబ్బ‌.దీంతో గ్రేట‌ర్ ఫైట్‌ను మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు కేటీఆర్‌.

ఉద‌యాన్ని ప్ర‌చారానికి ప్రారంభ‌మ‌వుతున్నారు.

ఎక్క‌డా విరామం లేకుండా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

బీజేపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.హ‌రీష్ రావు మాదిరిగా కాకుండా.

ఆయ‌న వ్యూహాత్మ‌కంగా నాయ‌కుల‌లో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.గెలుపు నాది మాత్ర‌మే కాద‌ని.

అంద‌రిదీ అని చెబుతున్నారు.మ‌రి ఇది ఫ‌లిస్తుందా?  కేటీఆర్ విజ‌యం సాధిస్తారా?  చూడాలి.ఏం జ‌రుగుతుందో.

#Congress #Greater Fight #GHMC Elections #Harish Rao #Trs Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు