మొత్తం ఆయనే చేశారు : టీఆర్ఎస్ లో హరీష్ కు పెరిగిన క్రేజ్ !

టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అధికారం దక్కింది… ఎన్నికల ముందు విజయం పై ఎంతయితే ధీమాగా ఉన్నారో … అంతే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో వ్యూహాలు రచించి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టారు.తెలంగాణాలో టీఆర్ఎస్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్లగా టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ , టీజేఎస్ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ మీద దండయాత్ర చేశాయి.

 Harish Rao Plays Key Role In To Win Trs In Telangana-TeluguStop.com

అయితే ఆ పార్టీలన్నీ కలిసి టీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టినా … గులాబీ జెండా తెలంగాణాలో రెపరెపలాడించడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారు.ఈ విజయంలో కేసీఆర్ కుటుంబ నాయకులు హరీష్ రావు , కేటీఆర్, కవిత ఇలా అందరూ తమ శక్తికి మించి పోరాడి పార్టీ విజయానికి కారణం అయ్యారు.

ముఖ్యంగా ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావే అన్నది తెలంగాణాలో అందరూ చర్చించుకుంటున్న టాపిక్.

సిద్దిపేట నియోజక వర్గం నుంచి ఇప్పటికే 6సార్లు విజయం సాధించి డబుల్ హాట్రిక్ సాధించారు హరీష్‌రావు.ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి మహాకూటమి టీజేఎస్ అభ్యర్థి భవాణిరెడ్డిపై 1,18, 699 భారీ మెజార్టీతో విజయం సాధించారు.హరీష్ రావు హవా కేవలం సిద్ధిపేట వరకే పరిమితం కాలేదు.

మొత్తం తెలంగాణాలో కూటమికి ఎదురుగాలి వీయడానికి… టీఆర్ఎస్ జెండా రెపరెపలాడించడానికి బాగా దోహదం చేశాయి.తనకు బాధ్యతలు అప్పగించిన అన్ని కీలక నియోజక వర్గాల్లో కూడా ఆయన తన హవా చాటుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా… సీఎం అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న కీలక నాయకులు పరాజయం పాలవ్వడంతో హరీష్ మాస్టర్ స్కెచ్ బాగా ఉపయోగపడింది.

కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్‌లో ఆయనకు 50 వేల ఓట్ల మెజార్టీ రావడం వెనుక హరీష్ వ్యూహాలు బాగా పని చేశాయి.2014 ఎన్నికల్లోనూ కేసీఆర్‌ విజయంలో హరీష్‌ కీలక పాత్ర పోషించారు.ముఖ్యంగా కొడంగల్‌లో తమ పార్టీకి ఏకు మేకులా మారిన రేవంత్ రెడ్డిని మట్టి కరిపించడంలో హరీష్ వ్యూహాలు బాగా పనిచేసాయి.

ఎన్నికలకు ముందు కొడంగల్‌లో పర్యటించడం, పోలింగ్‌ ముందు కేసీఆర్‌ సభ ఏర్పాటు.ఇలా కొడంగల్‌ రాజకీయాన్ని మార్చేశారు హరీష్‌రావు.నరేందర్‌రెడ్డి గెలుపు వెనుక హరీష్ రావు అస్త్రాలు బాగా పనిచేసాయి.అలాగే … గద్వాల్ ఇంచార్జ్‌గా వ్యవహరించిన హరీష్‌రావు.

డీకె అరుణ ఓడిపోవడానికి చాలా మంత్రంగం నడిపారు.ఇక్కడే కాదు కాంగ్రెస్ సీనియర్స్ పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ హరీష్ చక్రం తిప్పారు.

హరీష్ మీద నమ్మకంతోనే ఆయనకు ఒక హెలికాఫ్టర్ సైతం సమకూర్చి ప్రచారం చేయించారు కేసీఆర్.ఇప్పుడు పార్టీ ఈ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే అది హరీష్ కృషే అన్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.

అందుకే గతంలోకంటే ఇప్పుడు హరీష్ రావు క్రేజ్ పార్టీలో బాగా పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube