ఏంటో ఈ హరీష్ పరిస్థితి ? నమ్మడు.. వదలడు

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఒకపక్క ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.తెలంగాణలో బలపడుతున్న బిజెపి ఒకవైపు, ప్రజా వ్యతిరేకత మరోవైపు తీవ్రంగా ఎదుర్కొంటోంది.

 Trs, Kcr, Ktr, Telangana, Cm, Hareesh Rao, Trs Harish Rao Unhappy With Cm Kcr Po-TeluguStop.com

వాటన్నిటినీ తట్టుకుని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళే విషయం పై కేసీఆర్ దృష్టి పెట్టాడు.మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించే ప్రక్రియకు కెసిఆర్  శ్రీకారం చుట్టబోతున్నారు.

దీనికి సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయింది.ఇప్పటికే మంత్రులు , ఎమ్మెల్యేలు పార్టీల నాయకులంతా పదేపదే కేటీఆర్ కాబోయే సీఎం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు బాగా పెరిగిపోతున్నాయి.ఈ గ్రూపు రాజకీయాల్లో కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు ప్రస్తావన పదే పదే వస్తోంది.
గత కొంత కాలంగా హరీష్ రావు చాలా సైలెంట్ అయ్యారు.రాజకీయ పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.కేవలం నామ మాత్రంగానే స్పందిస్తున్నారు.రాజకీయ వ్యవహారాలపై అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు.

పదే పదే కేటీఆర్ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నాయకులు వ్యక్తం చేస్తున్నా, హరీష్ మాత్రం ఆ టాపిక్ మీద స్పందించడం లేదు.అసలు టిఆర్ఎస్ లో ఉన్న రాజకీయాలపై హరీష్ చాలా కాలంగా చాలా అసంతృప్తితోనే ఉంటున్నారు.

అయినా, అది ఎక్కడా బయట పడకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు.ఇక కేసీఆర్, కేటీఆర్ సైతం హరీష్ కు ప్రాధాన్యం చాలా తగ్గించేశారు అనే టాక్ నడుస్తోంది.

Telugu Hareesh Rao, Ktr Cm, Telangana, Telangana Cm, Trsharish-Telugu Political

వాస్తవంగా చెప్పుకుంటే టీఆర్ఎస్ లో హరీష్ రావు కు ఉన్న పట్టు అంతా ఇంతా కాదు.కేసీఆర్ తరువాత ఆ పార్టీ లో బలమైన నాయకుడుగా నే కాకుండా, ట్రబుల్ షూటర్ గానూ ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.కానీ ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కడం లేదు అనేది టీఆర్ఎస్ లో టాక్.అసలు కేసీఆరే హరీష్ కు మంట పుట్టించే విధంగా ఈ విధమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు అనే టాక్ ప్రస్తుతం పార్టీలో నడుస్తోంది.

మొదటి నుంచి తన వెన్నంటే నడిచిన హరీష్ రావు కి.కేసీఆర్ పొగ పెడుతున్నారు అని, ఈ విషయం హరీష్ కు బాగా తెలుసు అని, అయినా, ఎక్కడా తన అసంతృప్తి బయట పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube