ఆ లిస్ట్ లో హరీష్ రావు పేరు లేదేంటి ? ప్రాధాన్యం తగ్గించేశారా ?

టిఆర్ఎస్ పార్టీ ! ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ పార్టీ అధినేత కెసిఆర్.ఆ తరువాతి పేరు ఆయన మేనల్లుడు హరీష్ రావు.

 Harish Rao Missing As Trs Announces Star Campaigners-TeluguStop.com

అయితే అదంతా ఒకప్పుడు.ఇప్పుడు హరీష్ రావు పేరు కానీ నీ ఆయన ప్రాధాన్యం గాని చూస్తే అట్టడుగున ఉన్నట్టు అనిపిస్తోంది.

పార్టీలో ఇప్పుడంతా కేటీఆర్ పేరే మారుమోగుతోంది.టిఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు ఒకప్పుడు హరీష్ రావుకు కు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి హరీష్ రావు తీవ్రంగా శ్రమించారు.దీని ఫలితంగా ఆయనకు నీటి పారుదల శాఖ మంత్రి గా అవకాశం కూడా వచ్చింది.

ఆయన మంత్రిగా ఉండగానే అనేక భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి బీడు వారి పోయిన లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత హరీష్ రావు తన ఖాతాలో వేసుకున్నాడు.

కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

మొన్న జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హరీష్ రావు ప్రాధాన్యం బాగానే తగ్గి పోయినట్టే అనిపించింది.కనీసం ఆయనకు మంత్రి పదవి కూడా దక్కలేదు.

దీనికితోడు హరీష్ రావు వర్గం గా పేరు పొందిన వారు అందరినీ కెసిఆర్ పక్కన పెట్టడం పార్టీలో పెద్ద చర్చగా మారింది.ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు రాజీనామా చేయించి ఎంపీగా బరిలోకి దింపుతున్నారు.

కెసిఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టడంతో తనకు తోడుగా హరీష్ రావు ఉంటాడు అనే ఉద్దేశంతో ఆయనను ఎంపీగా బరిలోకి దింపుతున్నారు అని అంతా భావిస్తుండగా నే తెలంగాణ పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎస్ అభ్యర్థుల తరపున పోటీచేసే స్టార్ క్యాంపైన్ ల లిస్ట్ లో హరీష్ పేరు మిస్ అయ్యింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రిని చేసేందుకు హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయాలు ఉంటున్నాయని పార్టీ లో చర్చ నడుస్తోంది.సీనియర్ నాయకులు చెబుతున్నారు.

లోక్ సభ ఎన్నికలు కోసం పార్టీలో సీనియర్ నాయకులు అందరికీ స్థానం కల్పించిన కేసీఆర్ తన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు పేరు మాత్రం అందులో చేర్చలేదు.కానీ కేటీఆర్, కవిత పేర్లు చేర్చడంతో హరీష్ నొచ్చుకున్నట్టు పార్టీలో హాట్ టాపిక్ నడుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube