తెలంగాణలో ఫ్యూచర్ సీఎంగా..ఎవరు బెస్ట్ అంటే..?   Harish Rao, KTR Who Is Best For Telangana “CM”..?     2018-03-07   00:38:34  IST  Bhanu C

ఎత్తులకి పై ఎత్తులు వేయడంలో కేసీఆర్ ని మించిన వ్యక్తి తెలంగాణలో లేరని అంటారు..తెలంగాణా రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పగల వ్యక్తి కేసీఆర్ గత కొన్ని రోజులుగా కేసీఆర్ మోడీని,కేంద్రాన్ని టార్గెట్ గా చేస్తూవస్తున్నా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి..ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలు ఏమి చేయలేదు..వాటి వల్ల దేశానికి జరిగిన అభివృద్ధి ఏమిలేదు అంటూ బిజెపి ,కాంగ్రెస్ లపై ఫైర్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే..అయితే థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడిన కేసీఆర్ ప్రధానిని కావాలనే కోరికను బయటపెట్టడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచీ మొదలు జాతీయ రాజకీయాలలో తీవ్ర చర్చలకి దారి తీస్తున్నాయి..అయితే ఇక్కడే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటపడుతున్నాయి.

కేసీఆర్ కి జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల సత్తా నిజంగానే ఉందా..? చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ విషయంలో ఆసక్తి కనబరచటం లేదు ఈ సమయంలో కేసీఆర్ ఒక్కడే థర్డ్ ఫ్రంట్ ని ముందుకు నడిపించగలడా అంటే అంత సీన్ లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అయితే కేసీఆర్ ఆడే థర్డ్ ఫ్రంట్ నాటకం అంతా కూడా కేటిఆర్ ని సీఎం గా గద్దెనెక్కించడం కోసమే అంటున్నారు..తానూ ఎంపీగా పోటీ చేస్తూ రాష్ట్ర రాజకీయాల నుంచీ తప్పుకుంటూ సీఎం గా కొడుకు కేటిఆర్ ని కుర్చోబెట్టాలనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి..అయితే ఇప్పుడు తెలంగాణలో మరో హాట్ టాపిక్ వైరల్ అవుతోంది..ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న బలమైన టీఆర్ఎస్ కేడర్ ని మరియు ప్రత్యర్ధి పార్టీల ని ఎదుర్కోగల సత్తా కానీ తెలివైన రాజకీయాలు చేయగల సత్తా కేటిఆర్ కి ఉందా లేదా అందరికీ అజాత శత్రువులా ఉంటూ ఎంతో అనుభవం ఉన్న హరీష్ రావు కి ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

కేసీఆర్ కి పార్టీలో ఎంత పట్టు ఉందొ హరీష్ రావుకి కూడా అదేవిధమైన బలం ఉంది..తన పార్టీ నాయకులని కంట్రోల్ చేయగల సామర్ధ్యం కూడా ఉంది..తెలంగాణా ఉద్యమ సమయంలో హరీష్ ఎంతో యాక్టివ్ గా పని చేశారు..ఉద్యమాన్ని ముందుఉంది నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు..అంతేకాదు ప్రతిపక్షాల నుంచీ జేఏసీ ఛైర్మెన్ వరకూ కూడా ఎప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి..టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హరీష్ రావు సైలెంట్ అయిపోయారు..ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం మానేశారు దీని వెనుకాల తప్పకుండా కేసీఆర్ ప్రభావం ఉంది అని బహిరంగానే అనేకసార్లు కాంగ్రెస్ నేతలు విమర్శించారు..హరీష్ కూడా ఈ విషయంలో అసంత్రుప్తిలో ఉన్నారని అప్పట్లో ఈ టాక్ వినిపించింది..అదే సమయంలో టీఆర్ఎస్ లో ఉన్న ఎంతో మంది బలమైన నేతలు కూడా హీరీష్ విషయంలో కేసీఆర్ చేస్తున్న పనులకి అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా ఉంది.

ఇదిలాఉంటే హరీష్ కి ఉన్న అనుభవం కానీ గ్రౌండ్ లెవిల్ లో పట్టు గాని కేటిఆర్ కి లేవనేది వాస్తవం..ఐటీ మంత్రిగా మంచి నాలెడ్జ్ పర్సన్ గా దూసుకు వెళ్తున్నాడు అనే విషయం పక్కన పెడితే గ్రామస్థాయిలో కానీ..పార్టీలో కీలకమైన నాయకుల వద్ద పట్టుగాని కేటిఆర్ కి లేవు..అంతేకాదు ఉద్యమ సమయంలో కూడా కేటిఆర్ అంతగా గుర్తింపు పొందిన నాయకుడు కూడా కాదూ..ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకుగా అందరు ఫాలో అవ్వాచ్చు కానీ హరీష్ కి కేటిఆర్ కి మధ్య వ్యత్యాసం చుస్తే మాత్రం ఇద్దరిలో హరీష్ మాత్రమే ఫ్యూచర్ లో సీఎం అభ్యర్ధిగా సక్సెస్ అవుతాడు అని అంటున్నారు..విశ్లేషకులు