హ‌రీశ్‌రావును ఇర‌కాటంలో ప‌డేస్తున్న ఈట‌ల‌.. ప‌దే ప‌దే అలాంటి వ్యాఖ్య‌లు

ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.ఆయ‌న ఎవ‌రికీ విలువ ఇవ్వ‌ర‌ని, కేసీఆర్ వ‌ల్ల హ‌రీశ్‌రావు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌ని ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు.

 Harish Rao Is Being Pitted Against Each Other Such Comments Over And Over Again-TeluguStop.com

ఇక దీనిపై ఒక‌సారి హ‌రీశ్‌రావు కూడా స్పందించి త‌న భుజంపై తుపాకీ ఎక్కుపెట్టొద్ద‌ని హిత‌వు ప‌లికారు.అయినా స‌రే ఈట‌ల మాత్రం ఈ విష‌యంలో హ‌రీశ్‌రావును విడిచిపెట్ట‌ట్లేదు.

హ‌రీశ్‌రావు త‌న‌మీద త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఆయ‌న ఇలా వైరం పెట్టుకోవ‌డం మంచిదికాద‌ని చెబుతున్నారు.

 Harish Rao Is Being Pitted Against Each Other Such Comments Over And Over Again-హ‌రీశ్‌రావును ఇర‌కాటంలో ప‌డేస్తున్న ఈట‌ల‌.. ప‌దే ప‌దే అలాంటి వ్యాఖ్య‌లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక హ‌రీశ్‌రావు కూడా ఈట‌ల రాజేంద‌ర్ మీద బాగానే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

పార్టీలో ఉండి పార్టీని చీల్చే ప్ర‌య‌త్నాలు చేశార‌ని, పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు.కాగా వీటిపై ఈట‌ల కూడా స్పందించారు.తాను ఎక్క‌డా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల్లో త‌న మ‌నుషుల‌ను గెలిపించుకునేందుకు డబ్బులు పంపించ‌రాని, కేసీఆర్ సీటుకు ఎస‌రు పెట్టార‌ని చెప్పారు.ఇక దాంతో పాటు ఇప్పుడు మ‌రోసారి హ‌రీశ్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌.

Telugu Bjp, Cm Kcr, Etala Rajender, Harish Rao, Huzurabad Elections, Tg News, Tg Politics, Trs-Telugu Political News

హ‌రీశ్‌రావు త‌న‌కంటే ఎక్కువ అవ‌మానాలు ప‌డ్డార‌ని, కావాలంటే ఆయ‌న త‌న ఇల్లాలిని అడ‌గాలంటూ చెప్పారు.హ‌రీశ్‌రావు ఎన్ని బాధ‌లు ప‌డ్డాడో త‌న‌కు తెలుస‌ని, కావాలంటే తాను ప‌డుకునే ట‌ప్పుడు త‌డిచిపోయిన దిండును అడ‌గాలంటూ చెప్పారు.కాగా ఇలాంటి వ్యాఖ్య‌లు నిత్యం ఈట‌ల చేస్తున్నా కూడా వాటిపై హ‌రీశ్‌రావు పెద్ద‌గా స్పందంచ‌ట్లేదు.త‌న‌కు అవమానాలు జ‌ర‌గ‌లేద‌ని పైకి చెప్తున్నా కూడా ఆయ‌న వాస్త‌వంగా ఈట‌ల మాట‌ల‌కు ఆయ‌న పెద్ద‌గా స్పందంచ‌ట్లేదు.

దీంతో ఈట‌ల మాట‌లు నింజ‌గానే హ‌రీశ్‌రావును ఇర‌కాటంలో ప‌డేస్తున్న‌ట్టు తెలుస్తోంది.మ‌రి ఇలాంటి వాటిపై స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే హ‌రీశ్‌రావు ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై అనుమానాలు పెంచేస్తున్నార‌నే చెప్పాల్సి వ‌స్తుంది.

#CM KCR #Etala Rajender #Huzurabad #Tg #Tg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు