ప్ర‌గ‌తి భ‌వ‌న్ టాస్క్‌లో హ‌రీశ్‌రావు.. స‌త‌మ‌త‌మ‌వుతున్న ట్ర‌బుల్ షూట‌ర్‌!

హ‌రీశ్‌రావు అంటే కేసీఆర్‌కు మాత్ర‌మే కాదు యావ‌త టీఆర్ఎస్‌కు ఓ బ‌ల‌మైన న‌మ్మ‌కం.ఆయ‌న‌కు ఏదైనా ప‌నిఅప్ప‌జెప్పితే దాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా చేసి తీరుతార‌ని అంద‌రికీ తెలిసిందే.

 Harish Rao In Pragati Bhavan Task Trouble Shooter Is Troubling-TeluguStop.com

ముఖ్యంగా రాజ‌కీయ వ్యూహాలు పన్న‌డంలో ఆయ‌న దిట్ట‌.ఈ కార‌ణాల వ‌ల్లే కేసీఆర్ ఏ ఎన్నిక‌ల‌యినా హ‌రీశ్ రావుకు బాధ్య‌త‌లు అప్ప‌జెపుతుంటారు.

ఇప్పుడు కూడా అదే బాట‌లో హ‌రీశ్‌రావును ఉంచారు కేసీఆర్.అయితే గ‌తంలో ఇచ్చినంత ప్రాధాన్య‌త ఈ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇవ్వ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.

 Harish Rao In Pragati Bhavan Task Trouble Shooter Is Troubling-ప్ర‌గ‌తి భ‌వ‌న్ టాస్క్‌లో హ‌రీశ్‌రావు.. స‌త‌మ‌త‌మ‌వుతున్న ట్ర‌బుల్ షూట‌ర్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకోవైపు ఈట‌ల రాజేంద‌ర్ కూడా త‌న‌కంటే హరీశ్‌రావుకే ఎక్కువ అవ‌మానాలు జ‌రిగాయ‌ని చెప్ప‌డం టీఆర్ఎస్‌లో గంద‌ర‌గోళం సృష్టించిందిన సంగ‌తి తెలిసిందే.దీంతో కేసీఆర్ హ‌రీశ్‌రావుపై దృష్టి పెట్టి ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్నారు.

హ‌రీశ్‌రావు లాంటి నాయ‌కుడు త‌న‌కు ప్ర‌తి విష‌యంలో అవ‌స‌ర‌మే అని కేసీఆర్ గుర్తించి మ‌ళ్లీ పెద్ద‌పీట వేస్తున్నారు.ఇందులో భాగంగా హ‌రీశ్‌రావును త‌న వెంటే ప్ర‌తి స‌మీక్ష‌కు పిలుస్తున్నారు.

అలాగే ఆస్ప‌త్రుల విజిట్‌కు వెళ్లిన‌ప్పుడు కూడా ఆయ‌న వెంటే తీసుకెళ్లారు.

అంతే కాదు కొవిడ్ క‌ట్ట‌డికి వేసిన స్టాండింగ్ క‌మిటీకి ఆయ‌న్ను చైర్మ‌న్‌ను చేశారు కేసీఆర్‌.

అలాగే మొన్న ఆస్ప‌త్రుల మీద స్ట‌డీ చేసి మెరుగైన వైద్య స‌దుపాయాలు పెంచే కేబినెట్‌ స‌బ్ క‌మిటీకి కూడా హ‌రీశ్‌రావునే చైర్మ‌న్‌ను చేశారు కేసీఆర్‌.అంతే కాదు ఇప్పుడు హుజూరాబాద్ లో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్య‌త‌ను కూడా అప్ప‌గించారు.ప్రాధాన్య‌త పెర‌గ‌డం ప‌ట్ల హ‌రీశ్ రావు సుముఖ‌త గానే ఉన్నా.త‌న‌కు ఒకేసారి ఇన్ని టాస్క్‌లు అప్ప‌గించ‌డంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు ట్ర‌బుల్ షూట‌ర్‌.వీట‌న్నింటినీ స‌క్సెస్‌ఫుల్‌గా ఒకే టైమ్‌లో లీడ్ చేయ‌డం ఇప్పుడు హ‌రీశ్‌రావుకు క‌త్తిమీద సాము లాంటిదే అని చెప్పాలి.మ‌రి ట్ర‌బుల్ షూట‌ర్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

#Politics #Trouble Shooter #PragatiBhavan #Etela Rajender #Harish Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు