అయ్యో హరీష్ ! సానుభూతి ఓ రేంజ్ లో ఉందే

తెలంగాణాలో ఇప్పుడు సానుభూతి వర్షం కురుస్తోంది.అయ్యో హరీష్ అన్నా అంటూ ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు.

 Harish Rao Have Huge Fans Following In Telangana1tstop-TeluguStop.com

టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత మెయిన్ పిల్లర్ గా ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు వ్యవహరించారు.అయితే ఇప్పుడు హరీష్ రావు హవా టీఆర్ఎస్ లో కనిపించడంలేదు.

ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ హరీష్ ప్రాధాన్యతకు కొత్త పెట్టారు.ముఖ్యంగా చెప్పుకుంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం.

అతి తీవ్రంగా శ్రమించిన హరీష్‌కు కనీసం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు.దీంతో టీఆర్ఎస్ మీద ఆగ్రహం, హరీష్ మీద సానుభూతి ప్రజల నుంచి ఎక్కువయ్యింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హరీష్ రావు వెళ్ళలేదు.దీంతో సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శల వర్షం మొదలయ్యింది.

ఆ ప్రాజెక్ట్ కోసం హరీష్ కష్టపడితే క్రెడిట్ మాత్రం కేసీఆర్ కొట్టేస్తున్నారు అంటూ సెటైర్లు ఎక్కువయ్యాయి.

-Telugu Political News

తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు నుంచీ హరీష్ రావు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.కేటీఆర్ ను రాజకీయంగా బలపరిచేందుకు కేసీఆర్ ఈ విధంగా చేస్తూ వచ్చాడు.ఆయన్ను కేవలం సిద్దిపేట ఎమ్మెల్యేగా మాత్రమే.

పరిమితం చేశారు.ఆయనకు కనీస గౌరవం దక్కడం లేదు.

ప్రగతిభవన్‌లో కి ఎంట్రీ లేదు.ఫామ్‌హౌస్‌కి పిలుపురాదు.

ఓ రకంగా ఇప్పుడు హరీష్ టీఆర్ఎస్ లోనే ఉన్నా లేనట్టుగానే ఉన్నారు.అయినా హరీష్ తన అసంతృప్తిని ఎక్కడా బయటపెట్టలేదు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి పిలువలేదని ఆయన ఏమాత్రం బాధపడలేదు.అధినేత కేసీఆర్ కు కనువిప్పుకలిగేలా అన్నట్టుగా సిద్దిపేటలోఘనంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.

తన గురించి చెప్పుకోలేదు కానీ కేసీఆర్‌ను పొగుడుతూ సరికొత్త శైలిలో తన నిరసనను తెలిపారు.

-Telugu Political News

కేసీఆర్ ఎలా రాజకీయాలు చేస్తారో కింది స్థాయి నుంచి తెలిసిన నేత.ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించగలిగిన నేత అంతే కాదు కేసీఆర్ రాజకీయానికి మరింత మెరుగులు పెట్టి.అద్భుతమైన ఫలితాలు సాధించడం హరీష్‌కు వెన్నతో పెట్టిన విద్య.

అందుకే పార్టీ తనను దూరం పెట్టినా ఆయన మాత్రం విధేయత చూపుతున్నారు.కేసీఆర్ అవమానిస్తున్నాచిరునవ్వుతో ఉంటున్నారు.

రాజకీయ జీవితం ఇచ్చిన గురువు పట్ల.గౌరవం ప్రదర్శిస్తున్నానన్న సందేశాన్ని పంపుతున్నారు.

పదవుల కోసం తాను ఏదో చేయాల్సిన అవసరం తనకు లేదని చెబుతున్నారు.ఇవన్నీ హరీష్ క్రేజ్ ను అమాంతం పెంచేశాయి.

సొంత పార్టీ నేతల్లో కూడా ఇదేరకమైన సానుభూతి ఉన్నా అది ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు.ఏది ఏమైనా హరీష్ కు జరుగుతున్న అన్యాయం మీద కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి తొందరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube