టీఆర్ఎస్ లో 'చక్రం తిప్పుతున్న'...హరీష్ రావ్..!!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ గులాబీ జెండా ఊపిన క్షణం మొదలు ఇప్పటి వరకు కూడా అలుపెరగకుండా కష్టపడుతున్న ఏకైక నేతగా హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో మంచి పేరు కొట్టేస్తున్నారు.కెసిఆర్ ఆలోచిస్తున్న వ్యూహప్రతివ్యూహాల్లో హరీష్ రావు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

 Harish Rao Eye On Kodangal Constituency-TeluguStop.com

అంతేకాదు కేసీఆర్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో హరీష్ రావు తో చర్చించకుండా ఎటువంటి విషయాన్నైనా సరే ఫైనల్ చేయడంలేదట.ఇదిలా ఉంటే కేసీఆర్ కి అప్పగించిన ప్రతి బాధ్యతను తూచా తప్పకుండా హరీష్ రావు పాతిస్తున్నారట.

అంతేకాదు తన మార్కు రాజకీయాన్ని గత ఎన్నికల్లో లాగానే ఇప్పుడు కూడా చూపిస్తున్నారట హరీష్ రావు…వివరాలలోకి వెళ్తే.

హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు.తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు.ఇప్పటికే టిక్కెట్ల కేటాయింపులో కొంతమంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పార్టీలకు రాజీనామాలు చేసేస్తున్నారు.

ఈ తరుణంలో హరీష్ రావు ఆ పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ అసంతృప్తులను కారెక్కించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలాఉంటే మహా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దుబ్బాక ను టీజేఏసీ కేటాయించింది దాంతో ఆ స్థానంలో పట్టు ఉన్న మాజీమంత్రి ముత్యంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

దాంతో హరీష్ వేగంగా పావులు కదుపుతూ కాంగ్రెస్ పార్టీకి అవకాసం ఇవ్వకుండా ముత్యం రెడ్డి వద్దకు వెళ్లి ఆయన్ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.దాంతో హరీష్ వేసిన ఎత్తులు సక్సెస్ కావడంతో ఆయన 20వ తేదీన ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే

హరీష్ రావు కి కేసీఆర్ ఇప్పటికే అత్యంత కీలకమైన బాధ్యతను అప్పగించారు కూడా అదేంటంటే.తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కి కొరకరాని కొయ్యగా మారిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఆ కీలక బాధ్యతలను సైతం హరీష్ రావు కు అప్పగించడం ఆయనపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది…హరీష్ రావు కూడా కొంతమంది వ్యక్తులతో ఒక టీం ని ఏర్పాటు చేసిన వారిని రేవంత్ నియోజకవరం అయిన కొడంగల్ లో గడప గడపకి తిరిగి సమస్యలని తెలుసుకోమని వాటిని ఎప్పటికప్పుడు తనకి తెలియచేయాలని ఆదేశించారట అయితే వారు తెలుసుకున్న ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ హరీష్ కొండగల్ లో రేవంత్ కి చెమటలు పట్టిస్తున్నరాని తెలుస్తోంది.ఇలా హరీష్ ఒక పక్క తన నియోజకవర్గంలో గెలుపుపై దృష్టి పెడుతూనే మరో పక్క కేసీఆర్ అప్పగిస్తున్న భాద్యతలని సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ కీలకంగా మారుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube