హుజూర్‌నగర్‌లో కారు జోరు కనిపించడం లేదని రంగంలోకి హరీష్‌  

Harish Rao Election Campaign In Huzurnagar Election In Soon-shanam Pudi Saidhi Reddy,telangan Cm Kcr,telangana Cm Kcr

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.ఆయన గెలుపు కోసం కేటీఆర్‌ ఇప్పటికే రోడ్డు షోలు చేయడంతో పాటు ప్రచారం నిర్వహించాడు.

Harish Rao Election Campaign In Huzurnagar Election In Soon-shanam Pudi Saidhi Reddy,telangan Cm Kcr,telangana Cm Kcr-Harish Rao Election Campaign In Huzurnagar Soon-Shanam Pudi Saidhi Reddy Telangan Cm Kcr Telangana

అయినా ఇంకా కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుపై నమ్మకం కలగడం లేదు.దాంతో హరీష్‌ రావును కూడా రంగంలోకి దించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రచారం చివరి రెండు లేదా మూడు రోజుల్లో హుజూర్‌ నగర్‌ నియోజక వర్గం వ్యాప్తంగా హరీష్‌ రావు సుడిగాలి పర్యటన చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Harish Rao Election Campaign In Huzurnagar Election In Soon-shanam Pudi Saidhi Reddy,telangan Cm Kcr,telangana Cm Kcr-Harish Rao Election Campaign In Huzurnagar Soon-Shanam Pudi Saidhi Reddy Telangan Cm Kcr Telangana

కేవలం హరీష్‌ రావు వల్లే హుజూర్‌ నగర్‌లో విజయం సాధ్యం అవుతుందని, ఇప్పటికే హరీష్‌ రెండు మూడు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి చివరి రోజుల్లో అయినా హరీష్‌ రావు ప్రచారం చేస్తే ఫలితం తారు మారు అయ్యేనో చూడాలి.