హరీష్ రావ్ 'బాబు'ని అంతమాట అనేశాడ..!  

Harish Rao Comments On Chandrababu Naidu-

  • తెలంగాణ టిఆర్ఎస్ నేత కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావు టిడిపి అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని, ప్రజలు టిడిపిని చిత్తు చిత్తుగా ఓడిస్తారని హరీష్ రావు జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు పెద్ద మోసగాడు అని ఇటువంటి మోసగాడిని ఏపీ ప్రజలు ఏ మాత్రం భరించడానికి సిద్ధంగా లేరని హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

  • హరీష్ రావ్ 'బాబు'ని అంతమాట అనేశాడ..!-Harish Rao Comments On Chandrababu Naidu

  • Harish Rao Comments On Chandrababu Naidu-

    చంద్రబాబు చేసే ప్రతి పనిలో మాట్లాడే ప్రతి మాట లు మోసం ఉంటుందని, రైతు రుణమాఫీ దగ్గరనుంచి డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ వరకు అడుగడుగున చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారని హరీష్ రావు ఏపీ లోని రాజకీయ పరిస్థితులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కి కంప్యూటర్లపై ఉన్న మోజు నాగలి పట్టుకున్న రైతన్న మీద లేదని, పేదవాడి కడుపు నింపడానికి బాబు కి చెయ్యి రాదని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

    చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తో కలవడం ఎంతో దారుణమైన విషయమని , తెలంగాణ ప్రజలకు మొఖం చూపించడానికి వెనుకబడిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ వేసుకున్న ముసుగులో తలదూర్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అటు ఏపీ ప్రజలను, ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేసే పరిస్థితులు ఇక మీదట ఉండవని చంద్రబాబు రాజకీయ జీవితానికి ప్రజలు శుభం కార్డు వేయనున్నారని హరీష్ రావు తెలిపారు.

  • Harish Rao Comments On Chandrababu Naidu-

    సోనియాగాంధీ ఇటలీ దెయ్యం గా మారిందని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు సిగ్గులేకుండా ఢిల్లీకి వెళ్లి సోనియా రాహుల్ తో సమావేశమయ్యారని చంద్రబాబు ఈ చర్యలతో పూర్తి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ తేటతెల్లమయిందని , తెలంగాణలో చంద్రబాబు చెల్లని రూపాయి అని మహాకూటమి పేరుతో ముసుగేసుకుని వచ్చే చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు