ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరిన హరీష్ రావు...

గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని హుజురాబాద్ బిజెపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.

 Harish Rao Challenges Ethela Rajender-TeluguStop.com

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట లో వడ్డెర ఆశీర్వాద సభ కు మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.

ఈటెల రాజేందర్ పదవిలో ఉన్న ఐదు ఏండ్లలో హుజురాబాద్ నియోజకవర్గానికి 4000 ఇండ్లు మంజూరు చేస్తే ఒక్కటైన కట్టలేదని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.ఈటల ను గెలిపిస్తే బిజెపి పార్టీకి ఇద్దరు పోయి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు తప్ప ప్రజలకు ఒరిగేది ఎం లేదన్నారు.

 Harish Rao Challenges Ethela Rajender-ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరిన హరీష్ రావు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారని, ఆ మీటింగ్ కు పోకండి అంటూ మనిషికి 300 రూపాయలు పంచుతున్నరని ఆరోపించారు.అధికారంలో ఉన్నప్పుడు, కుర్చీలో ఉన్నప్పుడు పేద ప్రజలు కనపడలేదా అని ఈటెల రాజేందర్ ను ప్రశ్నించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అండగా ఉంటే ఈటెల మాత్రం టిఆర్ఎస్ పార్టీని దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.దున్నపోతులకు గడ్డి వేసి బర్రెలకు పాలు పిండితే రావని, పేదల పై పన్నులు వేసే ప్రభుత్వం నీ బిజెపి ప్రభుత్వం అని ఈటెల ను విమర్శించారు.

గేళ్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని పైసలతో మనిషిని ఆపుతారు కాని మనసుని అపలేరని అన్నారు.గేళ్లు శ్రీనివాస్ ని గెలిపించి మన నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని, అబద్ధాలా బిజెపి బోగస్ మాటలు నమ్మద్దని ప్రజలకు తెలిపారు.

#Gas Cylinder #Harish Rao #Poltics #Trs #Huzurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు