కోమటి రెడ్డి బ్రదర్స్‌ను హరీష్‌ కారెక్కించబోతున్నాడా?  

Harish Rao And Komati Reddy Brother Meeting In Assembly Hall-nalagonda,rajagopal Reddy Join In Bjp,telangana,trs Party

నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాష్ట్ర కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు, ఇప్పటికి పోషిస్తూనే ఉన్నారు.నల్లగొండలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పునాది వేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలు త్వరలోనే పార్టీ మారబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

Harish Rao And Komati Reddy Brother Meeting In Assembly Hall-nalagonda,rajagopal Reddy Join In Bjp,telangana,trs Party-Harish Rao And Komati Reddy Brother Meeting In Assembly Hall-Nalagonda Rajagopal Join Bjp Telangana Trs Party

అయితే ఈ వార్తలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి.ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వంను ప్రశ్నిస్తూ పార్టీలోనే వీరిద్దరు పెద్ద తలనొప్పిగా మారారు.కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.బీజేపీతో చర్చలు కూడా జరిపి జాయిన్‌ అయ్యేందుకు సిద్దం అయ్యాడు.

Harish Rao And Komati Reddy Brother Meeting In Assembly Hall-nalagonda,rajagopal Reddy Join In Bjp,telangana,trs Party-Harish Rao And Komati Reddy Brother Meeting In Assembly Hall-Nalagonda Rajagopal Join Bjp Telangana Trs Party

చివరి నిమిషంలో బీజేపీలో జాయిన్‌ అయ్యే నిర్ణయాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నాడు.కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ ఇటీవలే రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించాడు.అలా ప్రకటించిన కొన్ని రోజుల్లోనే హరీష్‌ రావుతో భేటీ అవ్వడం చర్చనీయాంశం అవుతోంది.అసెంబ్లీ లాబీలో వీరిద్దరు మాట్లాడుకోవడం కనిపించింది.ఏకాంతంగా 30 నిమిషాల పాటు మాట్లాడారు.హరీష్‌ రావు మెల్లగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని కారు ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్‌ వచ్చింది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కారు ఎక్కితే నల్లగొండలో టీఆర్‌ఎస్‌ బలం మరింత పెరగడం ఖాయం.అందుకే హరీష్‌ రావు చాలా ప్రయత్నించి ఆయన్ను కారు ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.