మహాత్మాగాంధీ భార్య కస్తూరిబాయి బయోపిక్ లో పిల్ల జమిందార్ పిల్ల

ఇండియన్ హిస్టరీ చదువుకుంటే కచ్చితంగా మహాత్మాగాంధీకి ఒక అధ్యాయం ఉంటుంది.ఆయన లేకుండా భారతదేశ చరిత్ర ఎవరూ చెప్పలేరు.

 Hariprriya To Play Kasturba Gandhi In Biopic, Tollywood, Sandalwood, Mahatma Gan-TeluguStop.com

ఆయన సుదీర్ఘ స్వాతంత్ర్య ప్రస్తానం భారతావనిలో ప్రతి ఒక్క భారతీయుడు కచ్చితంగా గుర్తు చేసుకుంటాడు.అయితే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది నానుడి.

ఒక మగాడు సమాజానికి ఉపయోగపడే గొప్ప పనులు చేయాలంటే అందులో భార్యస్థానంలో ఉన్న ఆడవాళ్ళ ప్రోత్సాహం కచ్చితంగా ఉండి తీరుతుంది.అలాగే మహాత్మాగాంధీ జీవితంలో కూడా కస్తూరిబాయి గాంధీ ఉంది.

గాంధీ చరిత్రలో ఆమె ప్రస్తావన తక్కువగానే ఉన్నా కూడా ఆమె భాగస్వామ్యం లేకుండా గాంధీజీ ప్రయాణం సాగలేదనే చెప్పాలి.అలాంటి కస్తూరిబాయి జీవితానికి ఇప్పుడు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నం కన్నడ ఇండస్ట్రీలో చేస్తున్నారు.

ప్రస్తుతం బయోపిక్ లకి కొంత వరకు ఆదరణ వస్తూ ఉండటంతో కన్నడనాట ఆమె బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.

బరగురు రామచంద్రప్ప దర్శకత్వంలో తాయి కస్తూర్‌ గాంధీ టైటిల్‌ ఖరారు చేశారు.

కథానాయిక తెలుగులో పిల్ల జమిందార్ సినిమాలో నటించిన హరిప్రియను ఎంపిక చేశారు.తాను రాసిన కస్తూర్బా వర్సెస్‌ గాంధీ పుస్తకం ఆధారంగా ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

త్వరలో గుజరాత్‌, ఇతర రియల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.హరిప్రియ మాట్లాడుతూ గాంధీకి సంబంధించిన చిత్రాల్లో కస్తూర్బా ప్రస్తావన ఉంది.

అయితే, ఆమె కోణం నుంచి ఎవరూ కథను చెప్పలేదు.మా చిత్రంలో పూర్తిగా ఆమె వైపు నుంచి కథ చెబుతున్నాం.

గాంధీతో కస్తూర్బా అనుబంధం, కుటుంబ అంశాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆమె పాత్ర వంటివి చూపించబోతున్నామని చెప్పుకొచ్చింది.ఈ సినిమాలో మూడు గెటప్స్ లో తన పాత్ర ఉండబోతుందని చెప్పింది.

ఇక ఈ సినిమాలో గాంధీజీ పాత్రలో ఎవరిని చూపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube